Share News

ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రి ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి విచారం

ABN , Publish Date - Sep 22 , 2026 | 08:13 AM

ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రి ఎస్‌ఎన్‌సీయూ వార్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు.

ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రి ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి  విచారం
Telangana CM Revanth Reddy

హైదరాబాద్, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): ఆదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రి ఎస్‌ఎన్‌సీయూ వార్డులో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. చిన్నారుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు సీఎం ఓ ప్రకటన విడుదల చేశారు.


ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న చిన్నారులకు మెరుగైన వైద్యం అందించాలని, వారి ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులను సీఎం రేవంత్ ఆదేశించారు. ఈ ఘటనకు దారితీసిన కారణాలపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా అన్ని ఆస్పత్రుల్లో భద్రతా చర్యలను పటిష్ఠం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు.


ఆదిలాబాద్‌లో చిన్నారుల మృతిపై మంత్రి దామోదర్ రాజనర్సింహ దిగ్భ్రాంతి

Minister Damodar Rajnarsimha

ఆదిలాబాద్ రిమ్స్‌ ఆస్పత్రిలో జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆరా తీశారు. ఈ మేరకు ఉన్నతాధికారులతో ఫోన్‌లో మంత్రి మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు మృతి చెందడం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం‌ చేశారు. చిన్నారుల కుటుంబాలకు భగవంతుడు ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థించారు. ఈ మేరకు మంత్రి దామోదర్ ఓ ప్రకటన విడుదల చేశారు.


చిన్నారుల కుటుంబాలకు అండగా ఉంటామని మంత్రి ధైర్యం చెప్పారు. ఘటనా సమయంలో వార్డులో ఉన్న మిగిలిన చిన్నారులందరి పరిస్థితి నిలకడగా ఉందని, ఎవరికీ సమస్య లేదని అధికారులు మంత్రికి వివరించారు. పిల్లలందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు. అగ్నిప్రమాదానికి గల కారణంపై తక్షణమే‌ విచారణ ప్రారంభించాలని అధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

భారత్‌, ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశాలు తెలంగాణలో సృష్టిస్తున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి 23 వరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026: మంత్రి వాకిటి శ్రీహరి

ప్రతి గ్రామపంచాయతీని మోడల్‌గా తీర్చిదిద్దాలి: మంత్రి సీతక్క

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 08:51 AM