వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను శరవేగంగా పూర్తి చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
ABN , Publish Date - Sep 22 , 2026 | 08:31 AM
హైదరాబాద్ తరహాలో అన్ని రంగాల్లో వరంగల్ అభివృద్ధి సాధిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ తరహాలో అన్ని రంగాల్లో వరంగల్ అభివృద్ధి సాధిస్తోందని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా సీఎం పోస్టు పెట్టారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, టెంపుల్, ఫారెస్ట్ టూరిజం, వరంగల్ ఎయిర్‌పోర్ట్ రోడ్ కనెక్టివిటీ, బస్ టెర్మినల్, ఔటర్ రింగ్ రోడ్డు వంటి కీలక అంశాలపై నిన్న(సోమవారం) రాత్రి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు.
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను శరవేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఆస్పత్రి నిర్మాణ పనులను పర్యవేక్షించేందుకు ప్రత్యేక అధికారులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలిపారు. వీలైనంత త్వరగా ఈ ఆస్పత్రిని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
భారత్, ప్రపంచ భవిష్యత్తును తీర్చిదిద్దే అవకాశాలు తెలంగాణలో సృష్టిస్తున్నాం: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో డిసెంబర్ 11 నుంచి 23 వరకు ఖేలో ఇండియా యూత్ గేమ్స్-2026: మంత్రి వాకిటి శ్రీహరి
ప్రతి గ్రామపంచాయతీని మోడల్‌గా తీర్చిదిద్దాలి: మంత్రి సీతక్క
Read Latest Telangana News And AP News And National News
And Telugu News