గోదావరి, దేవాదుల ప్రాజెక్టు నీళ్లను సంపూర్ణంగా వినియోగించుకుంటాం: మంత్రి ఉత్తమ్
ABN , Publish Date - Sep 23 , 2026 | 12:37 PM
గోదావరి, దేవాదుల ప్రాజెక్టు నీళ్లను సంపూర్ణంగా వినియోగించుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తుంగతుర్తి నియోజకవర్గానికి దేవాదుల ప్రాజెక్టు నీళ్లు తెప్పిస్తానని మాటిచ్చారు.
సూర్యాపేట జిల్లా, సెప్టెంబర్ 23 (ఆంధ్రజ్యోతి): గోదావరి, దేవాదుల ప్రాజెక్టు నీళ్లను సంపూర్ణంగా వినియోగించుకోవడానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Telangana Minister Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. తుంగతుర్తి నియోజకవర్గానికి దేవాదుల ప్రాజెక్టు నీళ్లు తెప్పిస్తానని మాటిచ్చారు. ఈరోజు (బుధవారం) సూర్యాపేట జిల్లాలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు.
ఆ నీటిని ఉపయోగించుకుంటాం..
365 టీఎంసీల నీటిని చుక్క నీరు కూడా వృథా కాకుండా ఉపయోగించుకునేలా కృషి చేస్తానని మంత్రి ఉత్తమ్ పేర్కొన్నారు. మొత్తం దేవాదుల ప్రాజెక్టు నీళ్లు 768 టీఎంసీలు ఉన్నాయని.. అందులో 465 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్‌కు.. మరో 365 టీఎంసీలు తెలంగాణ వినియోగిచుకుంటాయని వెల్లడించారు. ఏ విధమైన రాజకీయ దురుద్దేశం లేకుండా కేసీఆర్ హయాంలో నిర్మించిన ప్రాజెక్టులను రిపేర్ చేయించడానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా మా నాన్న కోరిక మేరకు తాటిపాముల గ్రామాన్ని తన శక్తి మేర అభివృద్ధి చేస్తానని మంత్రి ఉత్తమ్ హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి..
వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి పనులను శరవేగంగా పూర్తి చేయాలి: సీఎం రేవంత్‌రెడ్డి
ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రి ఘటనపై సీఎం రేవంత్‌రెడ్డి విచారం
విదేశీ ఉద్యోగాల పేరుతో భారీ మోసం..
Read Latest Telangana News And AP News And National News
And Telugu News