తీవ్ర వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు
ABN , Publish Date - Sep 23 , 2026 | 07:52 AM
వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో తీవ్రవాయుగుండం కదులుతోందని తెలిపారు.
అమరావతి, సెప్టెంబర్ 23 (ఆంధ్రజ్యోతి): వాయువ్య బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. గడిచిన 6 గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో తీవ్రవాయుగుండం కదులుతోందని తెలిపారు. ఇది ప్రస్తుతానికి గోపాల్‌పూర్‌కు 150 కిలోమీటర్లు, కళింగపట్నానికి 100 కిలోమీటర్లు, ఒడిశాలోని పూరీకి 220 కిలోమీటర్లు, విశాఖపట్నానికి 180 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని చెప్పుకొచ్చారు. ఇవాళ రాత్రికి తీవ్రవాయుగుండంగా విశాఖపట్నం - గోపాల్‌పూర్ మధ్య తీరాలను దాటే అవకాశం ఉందని వెల్లడించారు.
ఈరోజు (బుధవారం), రేపు(గురువారం) భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎండీ ప్రఖర్ జైన్ దిశానిర్దేశం చేశారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున చెట్లు, హోర్డింగ్స్ వద్ద నిలబడరాదని సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని చెప్పుకొచ్చారు. ఇవాళ, రేపు కోస్తాంధ్రలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపారు. పలు జిల్లాల్లో చెదురుమదురుగా, అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తామని తెలిపారు.
విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అన్నారు. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు. రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఆకస్మిక వరదలపై లోతట్టు ప్రాంతాల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
HAM మోడల్‌తో చాలా వినూత్నంగా ముందుకెళ్తున్నాం: సీఎం చంద్రబాబు
స్థానిక ఎన్నికల్లో జనసేన గౌరవం తగ్గకుండా చూస్తా: పవన్ కల్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో తగ్గేదేలే: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News