Share News

స్థానిక ఎన్నికల్లో జనసేన గౌరవం తగ్గకుండా చూస్తా: పవన్ కల్యాణ్

ABN , Publish Date - Sep 22 , 2026 | 10:51 AM

స్థానిక ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో జనసేన గౌరవం తగ్గకుండా చూస్తానని స్పష్టం చేశారు.

స్థానిక ఎన్నికల్లో జనసేన గౌరవం తగ్గకుండా చూస్తా: పవన్ కల్యాణ్
AP Deputy CM Pawan Kalyan

కాకినాడ జిల్లా, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): స్థానిక ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో జనసేన గౌరవం తగ్గకుండా చూస్తానని స్పష్టం చేశారు. పిఠాపురంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో డిప్యూటీ సీఎం పాల్గొన్నారు. ఈరోజు (మంగళవారం) పిఠాపురంలో ఏర్పాటు చేసిన సభలో పదిమంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పవన్ కల్యాణ్ తన చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు.


కూటమి బలంగా ఉండాలి..

కూటమి బలంగా ఉండాలని పవన్ కల్యాణ్ ఆకాంక్షించారు. నేతలు అందరూ కలిసి పనిచేయాలని ఆదేశించారు. తనకు కృతజ్ఞత ఎక్కువ అని.. కష్టాల్లో ఉన్న మనిషికి అండగా ఉండటం తన గుణమని వ్యాఖ్యానించారు. మూడు నెలల్లో పిఠాపురంలో తన క్యాంప్ ఆఫీస్ తెరుస్తానని స్పష్టం చేశారు. ఎంపీ సీట్లు త్యాగం చేయడం వల్లనే జనసేనకు గుడ్ విల్‌తో పనులు జరుగుతున్నాయని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జూనియర్ డాక్టర్లకు ఏపీ సర్కార్ శుభవార్త.. స్టైపెండ్ పెంచుతూ ఉత్తర్వులు జారీ

ఏపీలో అతిభారీ వర్షాలు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: హోం మంత్రి అనిత

పోలీసులు కొట్టడం వల్లే సాయికృష్ణ చనిపోయాడు: సిట్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 12:01 PM