ఏపీలో అతిభారీ వర్షాలు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: హోం మంత్రి అనిత
ABN , Publish Date - Sep 21 , 2026 | 04:23 PM
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై హోం మంత్రి దిశానిర్దేశం చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 21 (ఆంధ్రజ్యోతి): బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత (AP Home Minister Anitha) పేర్కొన్నారు. ఈరోజు (సోమవారం) సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలు, విపత్తుల సంస్థ ఎండీ ప్రఖర్ జైన్, ఉన్నత అధికారులతో అత్యవసర టెలికాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై హోం మంత్రి అనిత దిశానిర్దేశం చేశారు.
వంశధార, నాగావళి నదులు పొంగే అవకాశం ఉంది..
అల్పపీడనం ఎల్లుండికి (బుధవారం) తీవ్రవాయుగుండంగా బలపడి దక్షిణ ఒడిశా - ఉత్తరాంధ్ర తీరాలకు చేరుకునే అవకాశం ఉందని హోం మంత్రి అనిత వెల్లడించారు. రాష్ట్రంలో భారీ నుంచి అతిభారీ వర్షాల హెచ్చరిక నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని మార్గనిర్దేశం చేశారు. ప్రభావిత జిల్లాల అధికారులకు పలు సూచనలు జారీ చేశారు. ఒడిశాలో వర్షాలతో వంశధార, నాగావళి నదులు పొంగే అవకాశం ఉందని తెలిపారు. బోర్డర్ ఒడిశా జిల్లాల అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. సహాయక చర్యల కోసం SDRF, NDRF బృందాలను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు.
ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలి..
అవసరమైతే తీరం వెంబడి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని హోం మంత్రి అనిత మార్గనిర్దేశం చేశారు. వాగులు, పొంగిపొర్లే కాజ్‌వేలు, ముంపు ప్రాంతాల వద్ద హెచ్చరిక బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. కంట్రోల్ రూమ్‌లను 24 గంటల పాటు అందుబాటులో ఉంచి, పరిస్థితిని నిరంతరం సమీక్షించాలని అన్నారు. తీరం వెంబడి గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించారు. చెట్లు, భారీ హోర్డింగ్స్ , శిథిలావస్థలో ఉన్న ఇళ్ల వద్ద ఉండరాదని చెప్పారు. ప్రజలు.. ప్రభుత్వం జారీ చేసే వాతావరణ హెచ్చరికలను పాటించాలని... తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హోం మంత్రి అనిత సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ విద్యావ్యవస్థను నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేశ్
వైసీపీ నేతల తీరు మార్చుకోకపోతే ప్రజల ఛీత్కారానికి గురికాక తప్పదు: మంత్రి నారాయణ
శుభ్రమైన వీధి చీపురుతో మొదలవ్వదు: పవన్ కల్యాణ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News