Share News

ఏపీ విద్యావ్యవస్థను నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేశ్

ABN , Publish Date - Sep 20 , 2026 | 10:36 AM

ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నంబర్ వన్‌గా ఏపీ విద్యావ్యవస్థ మారుతుందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యమని.. అందుకే విద్యాశాఖ ఎంచుకున్నానని పేర్కొన్నారు.

ఏపీ విద్యావ్యవస్థను నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేశ్
AP Minister Nara Lokesh

కాకినాడ, సెప్టెంబర్ 20 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కృషికి నైతిక విలువలు తోడైతే దేశంలోనే నంబర్ వన్‌గా ఏపీ విద్యావ్యవస్థ మారుతుందని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. క్లాస్ రూం నుంచే సమాజంలో మార్పు సాధ్యమని.. అందుకే విద్యాశాఖ ఎంచుకున్నానని పేర్కొన్నారు. కాకినాడలో మంత్రి నారా లోకేశ్ ఈరోజు (ఆదివారం) పర్యటించారు. చాగంటి కోటేశ్వరరావు గోశాల ప్రాంగణంలో విద్యార్థులతో వ్యక్తిత్వ వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లోకేశ్ పాల్గొని ప్రసంగించారు.


ఈ ఏడాది 1.10 లక్షల మంది విద్యార్థులు ప్రైవేట్ నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారని లోకేశ్ ప్రస్తావించారు. ఇంటర్‌లో కూడా 10 వేల మంది విద్యార్థుల అడ్మిషన్స్ పెరిగాయని తెలిపారు. చాగంటి ద్వారా విలువల విద్యకు ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పుకొచ్చారు. రాజకీయాలకు దూరంగా విద్యావ్యవస్థ ఉండాలని ఆకాంక్షించారు. యూనిఫాం, బుక్స్, బ్యాగ్స్, బెల్ట్స్, షూస్ ఎక్కడా నో పొలిటికల్ పార్టీ కలర్స్ ఉండకూడదనే ఎక్కడా కూడా ముఖ్యమంత్రి, తన ఫొటోలు ముద్రించలేదని స్పష్టం చేశారు.


ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో తాను రాజకీయాల్లోకి వచ్చానని లోకేశ్ ఉద్ఘాటించారు. 2019లో పోటీ చేసి ఓడిపోయానని.. తొలిసారి ఫెయిల్ అయినా.. నిరాశకు లోను కాలేదని చెప్పారు. చాలామంది మంగళగిరి టీడీపీ సీటు తనకు సరికాదని... టీడీపీకి కంచుకోట లాంటి సీట్లలో పోటీ చేయాలని సలహా ఇచ్చారని అన్నారు. తాను పడిపోయిన చోటే నిలబడతానని ఛాలెంజ్ చేసి చూపించానని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సెప్టెంబర్ 21, 22 తేదీల్లో చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

స్థానిక ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేట్‌తో గెలుస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. చేనేత పెన్షన్ల వెరిఫికేషన్ అక్రమాలపై మంత్రి సవిత సీరియస్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 12:08 PM