Share News

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. చేనేత పెన్షన్ల వెరిఫికేషన్ అక్రమాలపై మంత్రి సవిత సీరియస్

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:29 PM

చేనేత పెన్షన్ల వెరిఫికేషన్ అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి ‘నేతన్నల పడిగాపులు’ పేరుతో ఆంధ్రజ్యోతి పేపర్‌ తీసుకువచ్చింది. ఆంధ్రజ్యోతి కథనాలపై ఏపీ మంత్రి సవిత స్పందించారు.

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. చేనేత పెన్షన్ల వెరిఫికేషన్ అక్రమాలపై మంత్రి సవిత సీరియస్
AP Minister Savitha

అమరావతి, సెప్టెంబర్ 19 (ఆంధ్రజ్యోతి): చేనేత పెన్షన్ల వెరిఫికేషన్ అక్రమాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టికి ‘నేతన్నల పడిగాపులు’ పేరుతో ఆంధ్రజ్యోతి పేపర్‌ తీసుకువచ్చింది. ఆంధ్రజ్యోతి కథనాలపై ఏపీ మంత్రి సవిత (AP Minister Savitha) స్పందించారు. ఈ క్రమంలో అన్ని జిల్లాల చేనేత, జౌళి శాఖ అధిరులతో మంత్రి సవిత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈరోజు (శనివారం) రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ ఆర్పీ సిసోడియా, అన్ని జిల్లాల ఏడీలు పాల్గొన్నారు. ఈమేరకు అధికారులకు మంత్రి సవిత కీలక ఆదేశాలు జారీ చేశారు.


సర్టిఫికెట్ల జారీలో చేతివాటం చూపితే విధుల నుంచి తొలగిస్తాం..

పలు జిల్లాల్లో చేనేత పెన్షన్ల వెరిఫికేషన్ అక్రమాలపై మంత్రి సవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వెరిఫికేషన్‌కు డబ్బులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సర్టిఫికెట్ల జారీలో చేతివాటం చూపితే విధుల నుంచి తొలగిస్తామని హెచ్చరించారు. నేతన్నలకు ఆర్థిక మేలు చేకూర్చాలన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి లక్ష్యాన్ని నీరుగారిస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. 50 ఏళ్లు నిండిన నేతలన్నలందరికీ పెన్షన్లు అందజేస్తామని స్పష్టం చేశారు. ఆరోపణలు వచ్చిన శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన ఇద్దరు ఉద్యోగులపై మంత్రి చర్యలు చేపట్టారు. ఈ మేరకు రమణారెడ్డి, శీనా నాయక్‌లను సస్పెండ్ చేస్తూ మంత్రి సవిత ఉత్తర్వులు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దశాబ్దాల నిరీక్షణకు తెర.. 25 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్న సీఎం

ఒరిజినల్ రెడ్ల ఆత్మగౌరవం కాపాడేలా పార్టీ పెడతా: విజయసాయి

దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌.. ఎండీఎల్‌తో ఏపీ సర్కార్‌ ఎంఓయూ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 19 , 2026 | 02:07 PM