దశాబ్దాల నిరీక్షణకు తెర.. 25 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్న సీఎం
ABN , Publish Date - Sep 18 , 2026 | 12:57 PM
దశాబ్దాలుగా ఇళ్ల హక్కుల కోసం ఎదురుచూస్తున్న వేలాది పేద కుటుంబాల కలను సాకారం చేస్తున్నామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
అమరావతి, సెప్టెంబర్ 18 (ఆంధ్రజ్యోతి): దశాబ్దాలుగా ఇళ్ల హక్కుల కోసం ఎదురుచూస్తున్న వేలాది పేద కుటుంబాల కలను సాకారం చేస్తున్నామంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. రేపు ( శనివారం) విశాఖపట్నంలో సీఎం పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు. ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్న 28,445 కుటుంబాలకు పూర్తి హక్కులను ప్రభుత్వం కల్పిస్తుందని తెలిపారు.
11 మండలాల పరిధిలో రూ.8,874 కోట్ల విలువైన 19,33,853 చదరపు గజాల స్థలాలను క్రమబద్ధీకరిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. 25 వేల పేద కుటుంబాలకు తమ నివాసాలపై పూర్తి హక్కులు కల్పిస్తూ పట్టాలను అందజేస్తున్నామని ప్రకటించారు. ఆయా నివాసాలకు శాశ్వత హక్కులతో ప్రతి కుటుంబానికి ఆస్తి, భవిష్యత్తుకు భరోసా, ఆత్మగౌరవం ఉంటుందని వివరించారు. ప్రపంచస్థాయి నగరంగా మారుతున్న విశాఖపట్నంలో సామాన్య కుటుంబాలను అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీస్ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
యువ క్రీడాకారులకు జ్యోతి యర్రాజీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు: మంత్రి లోకేశ్
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతకు ప్రత్యేక చర్యలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News