Share News

పోలీస్ శాఖలో పోస్టుల‌ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం

ABN , Publish Date - Sep 16 , 2026 | 08:07 AM

పోలీస్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పోలీసు శాఖలో 2,050 పోస్టుల‌ భర్తీకి ఏపీ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 378 ఎస్ఐ, 1,156 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది.

పోలీస్ శాఖలో పోస్టుల‌ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
AP Police Recruitment 2026

అమరావతి, సెప్టెంబర్ 16 (ఆంధ్రజ్యోతి): పోలీస్ అభ్యర్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. పోలీసు శాఖలో 2,050 పోస్టుల‌ భర్తీకి ఏపీ సర్కార్ నోటిఫికేషన్ విడుదల చేసింది. 378 ఎస్ఐ, 1,156 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనుంది. ఆయా పోస్టులకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలని సూచించింది. ఈ ఉద్యోగాల కోసం ప్రాథమిక రాత పరీక్ష తేదీని త్వరలో APSLPRB ప్రకటించనుంది. దరఖాస్తును అధికారిక వెబ్‌సైట్ (https://slprb.ap.gov.in) ద్వారా మాత్రమే ఆన్‌లైన్‌లో సమర్పించాలని ప్రభుత్వం సూచించింది.


ఏపీ సర్కార్ భర్తీ చేసే పోస్టులివే..

  • 09 - SI (SPF) పోస్టులు (పురుషులు),

  • 50 - SCT SI (కమ్యూనికేషన్) పోస్టులు (పురుషులు, మహిళలు),

  • 10 - SI (PTO) పోస్టులు, 43 సైంటిఫిక్ అసిస్టెంట్ (FSL) పోస్టులు,

  • 827 - PC (సివిల్/AR) పోస్టులు (పురుషులు, మహిళలు)

  • రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన, అగ్నిమాపక సేవల శాఖలో - 158 ఫైర్‌మెన్ పోస్టులు

  • జైళ్లు, సంస్కరణ సేవల శాఖలో - 171 వార్డర్ పోస్టులు (పురుషులు, మహిళలు)

  • 200 - PC (కమ్యూనికేషన్) పోస్టులు (పురుషులు, మహిళలు)

  • 213 - PC (మెకానిక్స్, డ్రైవర్లు) పోస్టులు (పురుషులు).


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉద్యోగ నియామకాల వయోపరిమితి పెంపు

ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు

మహాత్మాగాంధీ మునిమనవడు కిదార్ రామ్ గోబిన్‌తో అయ్యన్నపాత్రుడు భేటీ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 16 , 2026 | 08:47 AM