శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతకు ప్రత్యేక చర్యలు
ABN , Publish Date - Sep 16 , 2026 | 07:55 AM
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రహదారి భద్రతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.
తిరుపతి, సెప్టెంబర్ 16 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రహదారి భద్రతకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా భక్తుల సురక్షిత ప్రయాణానికి రవాణా, పోలీస్ శాఖల అధికారులు ఉమ్మడి తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలోనే కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులపై రవాణా శాఖ అధికారులు విస్తృత నిఘాపెంచారు. డ్రైవర్ల నిద్రమత్తు, అలసటను నివారించేందుకు టోల్‌గేట్ల వద్ద 'స్టాప్ అండ్ వాష్' కార్యక్రమం చేపట్టారు.
పదిరోజుల్లో 61 కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులను తనిఖీ చేస్తున్నట్లు డీటీవో కొర్రపాటి మురళీ మోహన్ తెలిపారు. బస్సులను తనిఖీ చేసి రూ.6 లక్షల జరిమానా వసూలు చేశామని వెల్లడించారు. నిద్రమత్తుతో వాహనాలు నడిపితే ప్రమాదాలు జరుగుతాయని డ్రైవర్లకు అధికారులు హెచ్చరించారు. ఈ తనిఖీల్లో ఎంవీఐలు శ్రీనివాసరావు, అతికానాజ్, సుబ్రహ్మణ్యం, దామోదర్ నాయుడు, మోహన్ కుమార్, రమణ నాయక్ పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉద్యోగ నియామకాల వయోపరిమితి పెంపు
ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలుగు రాష్ట్రాలకు అదనపు ఇళ్ల కేటాయింపు
మహాత్మాగాంధీ మునిమనవడు కిదార్ రామ్ గోబిన్‌తో అయ్యన్నపాత్రుడు భేటీ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News