దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్.. ఎండీఎల్‌తో ఏపీ సర్కార్ ఎంవోయూ
ABN , Publish Date - Sep 18 , 2026 | 01:30 PM
ఏపీలోని దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఎండీఎల్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఈ ఎంవోయూ చేసుకున్నారు.
అమరావతి, సెప్టెంబర్ 18 (ఆంధ్రజ్యోతి): ఏపీలోని దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ ఏర్పాటు కానుంది. ఈ మేరకు ఎండీఎల్‌తో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (AP Government) ఒప్పందం చేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) సమక్షంలో ఈ ఎంవోయూ చేసుకున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా రూ.15,000 కోట్ల పెట్టుబడితో 45 వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ఏడాదికి 12 లక్షల టన్నుల నౌకల నిర్మాణ సామర్థ్యాన్ని ఈ గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్ కలిగి ఉంది.
కాగా, సీఎం చంద్రబాబు అధ్యక్షతన 21వ రాష్ట్రస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం ఈరోజు (శుక్రవారం) సచివాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 29 పారిశ్రామిక ప్రాజెక్టులకు సంబంధించిన పెట్టుబడులపై సీఎం చర్చించారు. దాదాపు రూ.22 వేల కోట్ల విలువైన పెట్టుబడులకు సంబంధించిన ప్రాజెక్టులపై ఎస్ఐపీబీ సమావేశంలో ఆమోదం తెలిపే అవకాశాలు ఉన్నాయి. తద్వారా దాదాపు 20 వేల మందికి ఉద్యోగాలను కల్పించనున్నారు. ఇప్పటివరకు జరిగిన 20 ఎస్ఐపీబీ సమావేశాల్లో 359 ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. రూ.13.84 లక్షల కోట్ల పెట్టుబడులు, 10.59 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. ఎస్ఐపీబీ సమావేశానికి మంత్రులు నారా లోకేశ్, టీజీ భరత్, అనగాని సత్యప్రసాద్, వాసంశెట్టి సుభాశ్, పి.నారాయణ, కందుల దుర్గేశ్, గొట్టిపాటి రవికుమార్, బీసీ జనార్దన్ రెడ్డి, సీఎస్ సాయిప్రసాద్, పరిశ్రమలు, ఐటీ, ఐ అండ్ ఐ శాఖల కార్యదర్శులు హాజరయ్యారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పోలీస్ శాఖలో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం
యువ క్రీడాకారులకు జ్యోతి యర్రాజీ స్ఫూర్తిగా నిలుస్తున్నారు: మంత్రి లోకేశ్
శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా రోడ్డు భద్రతకు ప్రత్యేక చర్యలు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News