Share News

సెప్టెంబర్ 21, 22 తేదీల్లో చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

ABN , Publish Date - Sep 19 , 2026 | 12:05 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 21, 22వ తేదీల్లో రెండు రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 21వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పలు కార్యక్రమాలకు సీఎం హాజరుకానున్నారు.

సెప్టెంబర్ 21, 22 తేదీల్లో చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన
AP CM Nara Chandrababu Naidu

చిత్తూరు జిల్లా, సెప్టెంబర్ 19 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) సెప్టెంబర్ 21, 22వ తేదీల్లో రెండు రోజుల పాటు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. సెప్టెంబర్ 21వ తేదీన చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో పలు కార్యక్రమాలకు సీఎం హాజరుకానున్నారు. బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తుమ్సి గ్రామానికి ముఖ్యమంత్రి చేరుకుంటారు.


హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువ వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొనున్న సీఎం..

తుమ్సి నుంచి గుండిశెట్టిపల్లి వద్ద హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువ దగ్గరకు సీఎం చంద్రబాబు వెళ్తారు. అనంతరం హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్ కాలువ వద్ద జలహారతి కార్యక్రమంలో పాల్గొంటారు. అలాగే, కుప్పం మున్సిపాలిటీ తంబిగానిపల్లిలో రైతు బజార్‌కు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. కుప్పం కొత్తపేటలో బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తారు. అలాగే, పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు. అభివృద్ధి ప్రాజెక్టులు, కార్యక్రమాల గ్యాలరీని సీఎం సందర్శించనున్నారు. సెప్టెంబర్ 21వ తేదీ రాత్రి కుప్పం రైల్వేస్టేషన్‌లో ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత కుప్పం రైల్వేస్టేషన్‌లో దాదర్ – పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌కు సర్వీసును ప్రారంభిస్తారు.


HAM ప్రాజెక్టులకు శ్రీకారం..

ట్రైన్ నంబర్ 11005 దాదర్ – పుదుచ్చేరి ఎక్స్‌ప్రెస్‌కు ఫ్లాగ్‌ఆఫ్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. సెప్టెంబర్ 22వ తేదీన శాంతిపురం మండలంలో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీ HAM ప్రాజెక్టులకు శ్రీకారం చుడతారు. EC పౌల్ట్రీ షెడ్లను ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 22వ తేదీ సాయంత్రం చిత్తూరు జిల్లా తుమ్సి హెలిప్యాడ్ నుంచి బెంగళూరుకు సీఎం ప్రయాణించనున్నారు. బెంగళూరు నుంచి విమానంలో విజయవాడకు చేరుకుంటారు. ఆరోజు సాయంత్రం 6.20 గంటలకు ఉండవల్లి నివాసానికి సీఎం చంద్రబాబు వెళ్లనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దశాబ్దాల నిరీక్షణకు తెర.. 25 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్న సీఎం

ఒరిజినల్ రెడ్ల ఆత్మగౌరవం కాపాడేలా పార్టీ పెడతా: విజయసాయి

దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌.. ఎండీఎల్‌తో ఏపీ సర్కార్‌ ఎంఓయూ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 19 , 2026 | 12:43 PM