Share News

స్థానిక ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేట్‌తో గెలుస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్

ABN , Publish Date - Sep 19 , 2026 | 01:39 PM

స్థానిక సంస్థల ఎన్నికలపై ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేట్‌తో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.

స్థానిక ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేట్‌తో గెలుస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్
AP Minister Nadendla Manohar

విశాఖపట్నం, సెప్టెంబర్ 19 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికలపై ఆంధ్రప్రదేశ్ మంత్రి నాదెండ్ల మనోహర్ (AP Minister Nadendla Manohar) కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేట్‌తో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈరోజు (శనివారం) విశాఖపట్నంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించి, పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. కొన్ని పొరపాట్ల కారణంగా అభ్యర్థుల ఎంపికలో సమస్య తలెత్తితే వెంటనే పార్టీ హైకమాండ్‌కి తెలియజేయాలని సూచించారు. స్థానిక ఎన్నికల్లో ఆయా వార్డుల వారీగా నాయకత్వం సిద్ధ కావాలని పిలుపునిచ్చారు. పార్టీ నేతలకు అండగా నిలుస్తుందని మాటిచ్చారు. సమష్టి నాయకత్వంతో ముందుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే సీట్ల సంఖ్య ప్రాముఖ్యం కాదని.. గెలిచే బలం ఉన్న చోట పోటీ చేస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.


జనసేన జనం కోసం పుట్టింది..

నేటి నుంచి పవన్ కల్యాణ్ పూర్తిస్థాయిలో ప్రజలకు అందుబాటులోకి వస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాజకీయాల్లో పాఠాలు ఉండవని.. అనుభవమే పాఠమని చెప్పారు. గతంలో జీవీఎంసీలో మూడు చోట్ల గెలిచామని... ఏడు చోట్ల సెకండ్ ప్లేస్‌కు వచ్చామని వెల్లడించారు. స్థానిక ఎన్నికల్లో టికెట్ వస్తే గెలుస్తామనే ఆలోచనలు పక్కన పెట్టాలని... ప్రజలు చాలా నిశితంగా గమనిస్తున్నారని చెప్పారు. ప్రజల అవసరాలు, స్థానిక అంశాలపై ప్రత్యేక దృష్టితో కేడర్ పని చేయాలని సూచించారు. కూటమి భాగస్వామ్యం వల్లే ఏపీలో ఈ స్థాయికి చేరుకోగలిగామని.. మూడు పార్టీలు బలంగా ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడిదారులకు భరోసా కల్పించడంలో కూటమి విజయవంతమైందని అన్నారు. ఉత్తరాంధ్రకు వస్తున్న భారీ పెట్టుబడులే ఇందుకు ఉదాహరణ అని చెప్పారు. జనసేన జనం కోసం పుట్టిందని మంత్రి నాదెండ్ల మనోహర్ ఉద్ఘాటించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

దశాబ్దాల నిరీక్షణకు తెర.. 25 వేల కుటుంబాలకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేయనున్న సీఎం

ఒరిజినల్ రెడ్ల ఆత్మగౌరవం కాపాడేలా పార్టీ పెడతా: విజయసాయి

దుగరాజపట్నంలో గ్రీన్‌ఫీల్డ్ షిప్‌యార్డ్‌.. ఎండీఎల్‌తో ఏపీ సర్కార్‌ ఎంఓయూ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 19 , 2026 | 02:24 PM