Share News

శుభ్రమైన వీధి చీపురుతో మొదలవ్వదు: పవన్ కల్యాణ్

ABN , Publish Date - Sep 20 , 2026 | 10:16 AM

శుభ్రమైన వీధి చీపురుతో మొదలవ్వదని.. అది ఒక బాధ్యతాయుతమైన పౌరుడితో మొదలవుతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రపంచ పారిశుధ్య దినోత్సవం సందర్భంగా ఎక్స్(X) వేదికగా డిప్యూటీ సీఎం పవన్ పోస్టు పెట్టారు.

శుభ్రమైన వీధి చీపురుతో మొదలవ్వదు: పవన్ కల్యాణ్
AP Deputy CM Pawan Kalyan

అమరావతి, సెప్టెంబర్ 20 (ఆంధ్రజ్యోతి): శుభ్రమైన వీధి చీపురుతో మొదలవ్వదని.. అది ఒక బాధ్యతాయుతమైన పౌరుడితో మొదలవుతుందని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) వ్యాఖ్యానించారు. ప్రపంచ పారిశుధ్య దినోత్సవం సందర్భంగా ఎక్స్(X) వేదికగా డిప్యూటీ సీఎం పవన్ పోస్టు పెట్టారు. ప్రపంచ పారిశుధ్య దినోత్సవం నాడు, పరిశుభ్రతను మన జీవన విధానంలో ఒక భాగంగా చేసుకుందామని పిలుపునిచ్చారు. వ్యర్థాలను వాటి మూలం వద్దనే వేరు చేద్దామని, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దామని సూచించారు. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుందామని, పర్యావరణాన్ని పరిరక్షించడం మనందరి ఉమ్మడి బాధ్యత అని.. మన పిల్లలకు నేర్పుదామని సూచించారు.


పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ద్వారా, స్వచ్ఛ రథం వంటి కార్యక్రమాలతో ఈ సామూహిక స్ఫూర్తికి తాము మద్దతు ఇస్తున్నామని పవన్ కల్యాణ్ తెలిపారు. పునర్వినియోగ వ్యర్థాలకు పౌరులు విలువ ఇచ్చేలా తాము సహాయం చేస్తున్నామని అన్నారు. ఇప్పటికే రూ.20.11 కోట్ల విలువైన 1.30 కోట్ల కిలోల పొడి వ్యర్థాలను సేకరించడంతో దీని ప్రభావం రోజురోజుకూ పెరుగుతోందని చెప్పుకొచ్చారు. స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ కూడా రాష్ట్రవ్యాప్తంగా మెరుగైన పారిశుధ్యం, వ్యర్థాల నిర్వహణ, పరిశుభ్రమైన సమాజాల కోసం అనేక కార్యక్రమాలను చేపడుతోందని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సెప్టెంబర్ 21, 22 తేదీల్లో చిత్తూరు జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటన

స్థానిక ఎన్నికల్లో వందశాతం స్ట్రైక్ రేట్‌తో గెలుస్తాం: మంత్రి నాదెండ్ల మనోహర్

ఆంధ్రజ్యోతి ఎఫెక్ట్.. చేనేత పెన్షన్ల వెరిఫికేషన్ అక్రమాలపై మంత్రి సవిత సీరియస్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 20 , 2026 | 11:07 AM