Share News

పోలీసులు కొట్టడం వల్లే సాయికృష్ణ చనిపోయాడు: సిట్

ABN , Publish Date - Sep 21 , 2026 | 02:52 PM

గాదె సాయికృష్ణ మిస్సింగ్, డెత్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. పోలీసుల దాడిలో అతను మరణించాడని పేర్కొన్నారు.

పోలీసులు కొట్టడం వల్లే సాయికృష్ణ చనిపోయాడు: సిట్
Sai Krishna Case

విజయవాడ, సెప్టెంబర్ 21 (ఆంధ్రజ్యోతి): గాదె సాయికృష్ణ మిస్సింగ్, డెత్ కేసులో విజయవాడ ఏసీబీ కోర్టులో సిట్ అధికారులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. పోలీసుల దాడిలో అతను మరణించాడని పేర్కొన్నారు. సాయికృష్ణ అరెస్టు, పోలీసుల దాడిలో అతను హత్యకు గురైన వైనంపై కీలక ఆధారాలను కోర్టుకు సిట్ అధికారులు సమర్పించారు. స్వయంగా కోర్టు విచారణకు సిట్ ఐవో సుధాకర్ బాబు హాజరయ్యారు. సాయికృష్ణ మిస్సింగ్ నుంచి మరణం వరకు చోటు చేసుకున్న పరిణామాలు, ఆయా ఘటనలను ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు.


ఈ కేసును ఏపీ ప్రభుత్వం నిష్పక్షపాతంగా విచారణ చేయాలన్న ఆదేశాలకు అనుగుణంగానే విచారణ చేశామని సిట్ అధికారులు స్పష్టం చేశారు. సాయికృష్ణ మిస్సింగ్ కేసులో ఏడుగురిని నిందితులుగా చేర్చి సిట్ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. సాయికృష్ణ తల్లి విజయలక్ష్మి ఆరోపణల తర్వాత కృష్ణలంక పోలీసులు వ్యవహరించిన తీరును ఛార్జ్‌షీట్‌లో సిట్ అధికారులు పేర్కొన్నారు. టెక్నికల్ ఎవిడెన్స్, ఫోరెన్సిక్ ఎవిడెన్స్, సాక్షుల స్టేట్‌మెంట్లను సిట్ అధికారులు ఏసీబీ కోర్టుకు సమర్పించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఏపీ విద్యావ్యవస్థను నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేశ్

వైసీపీ నేతల తీరు మార్చుకోకపోతే ప్రజల ఛీత్కారానికి గురికాక తప్పదు: మంత్రి నారాయణ

శుభ్రమైన వీధి చీపురుతో మొదలవ్వదు: పవన్ కల్యాణ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 21 , 2026 | 10:09 PM