HAM మోడల్‌తో చాలా వినూత్నంగా ముందుకెళ్తున్నాం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Sep 22 , 2026 | 12:56 PM
HAM మోడల్‌తో చాలా వినూత్నంగా తాము ముందుకెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో అభివృద్ధిలో దూసుకెళ్తున్నామని పేర్కొన్నారు.
చిత్తూరు జిల్లా, సెప్టెంబర్ 22 (ఆంధ్రజ్యోతి): HAM మోడల్‌తో చాలా వినూత్నంగా తాము ముందుకెళ్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. కేంద్రప్రభుత్వ సహకారంతో అభివృద్ధిలో దూసుకెళ్తున్నామని పేర్కొన్నారు. చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గంలో సీఎం చంద్రబాబు ఈరోజు (మంగళవారం) పర్యటించారు. కడపల్లెలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. HAM ప్రాజెక్టులు, ఈసీ పౌల్ట్రీ షెడ్లు వర్చువల్‌గా ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
ఇవాళ ఒక్కరోజే రూ.11,359 కోట్ల పనులకు శ్రీకారం చుట్టాం..
జగన్ హయాంలో ఏపీని సర్వనాశనం చేశారని సీఎం ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను వైసీపీ హయాంలో దుర్వినియోగం చేశారని ఆగ్రహించారు. తాము అధికారంలోకి వచ్చినప్పుడు ఏపీ పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. డబ్బులు లేవని పనులు ఆపేస్తే సమస్యలు పెరిగిపోతాయని అన్నారు. ఎన్నికల హామీలను ఒక్కొక్కటిగా తాము నెరవేరుస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్రానికి ఆదాయం పట్టణాల నుంచే వస్తుందని చెప్పుకొచ్చారు. అన్ని మున్సిపాలిటీల్లో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని వివరించారు. ఇవాళ ఒక్కరోజే రూ.11,359 కోట్ల పనులకు శ్రీకారం చుట్టామని వెల్లడించారు. మిగిలిన రూ.17 వేల కోట్ల పనులను త్వరలోనే ప్రారంభిస్తామని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జూనియర్ డాక్టర్లకు ఏపీ సర్కార్ శుభవార్త.. స్టైపెండ్ పెంచుతూ ఉత్తర్వులు జారీ
ఏపీలో అతిభారీ వర్షాలు.. అధికారులు అప్రమత్తంగా ఉండాలి: హోం మంత్రి అనిత
పోలీసులు కొట్టడం వల్లే సాయికృష్ణ చనిపోయాడు: సిట్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News