Share News

తెలంగాణలో భూ అక్రమాలపై ప్రత్యేక కమిటీ విచారణ

ABN , Publish Date - Sep 24 , 2026 | 11:36 AM

తెలంగాణలో భూ అక్రమాలపై విచారణ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భూముల అక్రమాలు, అవకతవకలపై విచారణకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ మేరకు జీవో నంబర్ -134ను ప్రభుత్వం జారీ చేసింది.

తెలంగాణలో భూ అక్రమాలపై ప్రత్యేక కమిటీ విచారణ
Telangana Land Irregularities

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో భూ అక్రమాలపై విచారణ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భూముల అక్రమాలు, అవకతవకలపై విచారణకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ మేరకు జీవో నంబర్ -134ను ప్రభుత్వం జారీ చేసింది. వివిధ జిల్లాల్లో భూములకు సంబంధించిన అక్రమాలపై విచారణ కమిటీని నియమించింది.


చట్టాలు, నిబంధనలు, ప్రభుత్వ ఉత్తర్వుల ఉల్లంఘనలపై ఈ కమిటీ ఆరా తీయనుంది. ఈ అక్రమాలకు బాధ్యులెవరో తేల్చి తగిన చర్యలకు సిఫార్సులు చేయనుంది. ఈ కమిటీకి చైర్‌పర్సన్‌గా ఏ. శ్రీదేవసేన ఐఏఎస్ ఉన్నారు. కన్వీనర్‌గా రిజిస్ట్రేషన్స్ అండ్ స్టాంప్స్ స్పెషల్ సెక్రటరీ రాజీవ్‌గాంధీ హనుమంతు ఐఏఎస్, జనగామ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఐఏఎస్‌తో పాటు సంబంధిత జిల్లాల కలెక్టర్లను కూడా కమిటీ సభ్యులుగా నియమించింది.


ఈ భూములపై విచారణ చేయనున్న కమిటీ..

  • కేసీఆర్ కుటుంబం, కుటుంబ సభ్యులు, అనుచరులకు చెందిన భూములపై ఈ కమిటీ విచారణ చేయనుంది.

  • ఎర్రవల్లి, సిరివెంకటాపూర్ భూములపై..

  • మాజీ మంత్రి హరీశ్‌రావు కుటుంబం, అనుచరులకు చెందిన రామంచ భూములపై..

  • రంగనాయకసాగర్ సమీపంలోని భూములపై..

  • మల్లన్నసాగర్ భూసేకరణలో అక్రమాల ఆరోపణలపై..

  • జన్వాడలో కేటీఆర్ కుటుంబ సభ్యులు, అనుచరులు కొనుగోలు చేసిన భూములపై..

  • మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి కుటుంబం, ఆయన అనుచరుల భూములపై..

  • అజీజ్‌నగర్‌లో మాజీ మంత్రి హరీశ్‌రావు భూములపై..

  • అసైన్డ్ భూముల కొనుగోలు, ఆక్రమణలపైనా విచారణ

  • మాజీ మంత్రి గంగుల కమలాకర్‌కు సంబంధించిన ప్రభుత్వ భూముల వ్యవహారంపై..

  • వట్టినాగులపల్లిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి భూములపై..

  • శంకరాహిల్స్ భూముల కొనుగోలు వ్యవహారంపై..

  • జీరా భూముల్లో ఎల్విన్ స్టీఫెన్‌సన్ లీజ్ భూముల రెగ్యులరైజేషన్‌పై..

  • భూదాన్ భూముల కొనుగోలు వ్యవహారాలపై..

  • ధరణి మాడ్యూల్ దుర్వినియోగంపై..

  • మహబూబ్‌నగర్ జిల్లా గుండేడ్‌లోని పలు సంస్థల వ్యవహారాలపై ..

  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో అసైన్డ్, ప్రభుత్వ భూముల కేటాయింపులపై..

  • మిడ్ మానేర్ రిజర్వాయర్ పరిహారం, R&R ప్యాకేజీల వ్యవహారంపైనా ప్రభుత్వం నియమించిన కమిటీ విచారణ చేయనుంది.

అవసరమైన రికార్డులు, పత్రాలు, డేటాను కోరే అధికారం ఈ కమిటీకి ప్రభుత్వం అప్పగించింది. ఈ విచారణ నివేదికను త్వరితగతిన ప్రభుత్వానికి కమిటీ సమర్పించనుంది.


ఈ వార్తలు కూడా చదవండి..

పాలమూరుకు ఉపశమనం.. నీటి విడుదలకు కర్ణాటక గ్రీన్ సిగ్నల్..

గోదావరి, దేవాదుల ప్రాజెక్టు నీళ్లను సంపూర్ణంగా వినియోగించుకుంటాం: మంత్రి ఉత్తమ్

వాయుగుండం ప్రభావం.. తెలంగాణలో 4 రోజుల పాటు అతి భారీ వర్షాలు

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 02:56 PM