భారీ వర్షాల వేళ విజయవాడ కొండ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి: మంత్రి నారాయణ
ABN , Publish Date - Sep 23 , 2026 | 09:52 AM
వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై అధికారులను ఏపీ మంత్రి నారాయణ అప్రమత్తం చేశారు. భారీ వర్షాల ప్రభావం ఉన్న ఆయా ప్రాంతాల మునిసిపల్ కమిషనర్లకు పలు సూచనలు చేశారు.
అమరావతి, సెప్టెంబర్ 23 (ఆంధ్రజ్యోతి): వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలపై అధికారులను ఏపీ మంత్రి నారాయణ (AP Minister Narayana) అప్రమత్తం చేశారు. భారీ వర్షాల ప్రభావం ఉన్న ఆయా ప్రాంతాల మునిసిపల్ కమిషనర్లకు పలు సూచనలు చేశారు. వర్షాల కారణంగా జనజీవనానికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాలు జలమయం కాకుండా అదనపు సిబ్బందితో ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు.
అమరావతి నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలి..
వాయుగుండం ప్రభావం ఎక్కువగా ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాల్లోని మునిసిపాలిటీల్లో ఇంజినీరింగ్, పారిశుధ్య సిబ్బంది తక్షణ చర్యలు చేపట్టేలా సిద్ధంగా ఉండాలని మంత్రి మార్గనిర్దేశం చేశారు. విజయవాడలో కొండ ప్రాంత ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు. అమరావతి నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని పర్యవేక్షించాలని మునిసిపల్ శాఖ ఉన్నతాధికారులకు మంత్రి నారాయణ ఆదేశాలు జారీ చేశారు.
వర్షాల వేళ విద్యుత్ శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలి: మంత్రి గొట్టిపాటి

ఉత్తరాంధ్రలో భారీ వర్షాలపై ఈపీడీసీఎల్ అధికారులతో మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈరోజు (బుధవారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. వర్షాల వేళ విద్యుత్ శాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తితే యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించాలని సూచించారు. తగినంత సిబ్బందిని అందుబాటులో ఉంచుకుని ఎక్కడా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని నిర్దేశించారు. విద్యుత్ స్తంభాలు ఎక్కడైనా పడిపోతే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని మార్గనిర్దేశం చేశారు. విద్యుత్ అంతరాయాలు ఉంటే ప్రజలను అప్రమత్తం చేసేలా సమాచారం పంపాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
HAM మోడల్‌తో చాలా వినూత్నంగా ముందుకెళ్తున్నాం: సీఎం చంద్రబాబు
స్థానిక ఎన్నికల్లో జనసేన గౌరవం తగ్గకుండా చూస్తా: పవన్ కల్యాణ్
స్థానిక సంస్థల ఎన్నికల్లో తగ్గేదేలే: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News