Home » Guntakandla Jagadish Reddy
తెలంగాణలో భూ అక్రమాలపై విచారణ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భూముల అక్రమాలు, అవకతవకలపై విచారణకు ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ మేరకు జీవో నంబర్ -134ను ప్రభుత్వం జారీ చేసింది.
మాజీ మంత్రి కొండా సురేఖపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖను బీఆర్ఎస్‌లోకి రానివ్వమని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తన ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి కవితకు ఉన్న జ్ఞానానికి జోహార్లు అని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు బద్ధ శత్రువులుగా ఉన్న వాళ్లు, బీఆర్ఎస్‌ను ఖతం చేయాలని చూస్తున్న వారు ఏం మాట్లాడుతున్నారో.. కవిత అదే మాట్లాడుతున్నారని జగదీశ్ రెడ్డి విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీమంత్రి జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఆదానీలే రేవంత్ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. సెక్యూరిటీ లేకుండా వస్తే కేటీఆర్, రేవంత్‌రెడ్డి చరిష్మా తెలుస్తుందని చెప్పారు.
పత్తి రైతులను రాష్ట్ర ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. గత వరదల్లో పత్తి రైతుల నష్టాన్ని అంచనా వేయలేదని అన్నారు. తెలంగాణ రైతులకు ఒకలా.. గుజరాత్ రైతులకు మరోలా పత్తికి మద్దతు ధరను కేంద్ర ప్రభుత్వం ఇస్తోందని ధ్వజమెత్తారు.
మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలపై తెలంగాణ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవడంలో విఫలం అయిందని మాజీమంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విమర్శలు చేశారు. వర్షాల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు.
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీకి తెలంగాణకు ఏమైనా సంబంధం ఉందా? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తొలగిస్తామని వార్నింగ్ ఇచ్చారు. బీఆర్ఎస్ రాగానే సెక్రటేరియట్ ముందు తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టి తీరుతామని స్పష్టం చేశారు.
తెలంగాణలో గత 8 నెలలుగా పరిపాలన పడకేసిందని మాజీమంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి (Jagadish Reddy) ఆరోపించారు. ప్రతిపక్షంపై రాజకీయ విమర్శలు, దాడులు తప్ప మరేమీ లేదని విమర్శించారు. మరీ ముఖ్యంగా సాగునీటి రంగంలో ఘోరంగా విఫలమైందని ఆరోపణలు చేశారు.
తన ఏకైక లక్ష్యం నెరవేరిందని.. ఇంకో లక్ష్యం మాజీ సీఎం కేసీఆర్‌ని జైలు పంపడమేనని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ సమాధి అయ్యిందని విమర్శించారు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ - బీఆర్ ఎస్ కుటుంబ పార్టీ అని ఆరోపించారు.
విద్యుత్ రంగాన్ని ప్రైవేటు పరం చేసేందుకు రంగం సిద్ధమైందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagdish Reddy) అన్నారు. విద్యుత్ బిల్లుల వసూళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం ప్రైవేట్ పరం చేయడంలో మొదటి మెట్టు అని చెప్పారు.