Share News

ట్రావెల్స్ బస్సులో భారీ అగ్నిప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం

ABN , Publish Date - Sep 24 , 2026 | 08:11 AM

హైదరాబాద్‌ మీర్‌పేట్‌లోని గాయత్రీనగర్‌లో ఓ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గురువారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

ట్రావెల్స్ బస్సులో భారీ అగ్నిప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం
Hyderabad Fire Accident

హైదరాబాద్, సెప్టెంబర్ 24 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ మీర్‌పేట్‌లోని గాయత్రీనగర్‌లో ఓ ట్రావెల్స్ బస్సులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈరోజు (గురువారం) తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. హెచ్‌పీ పెట్రోల్ బంక్ వద్ద డీజిల్ పోస్తుండగా ప్రమాదం సంభవించింది. అకస్మాత్తుగా బస్సు కుడివైపు ఇంజిన్ భాగం నుంచి మంటలు వ్యాపించాయి. మంటలను గమనించిన డ్రైవర్ వెంటనే అప్రమత్తమయ్యారు.


బస్సులోని ప్రయాణికులంతా సురక్షితంగా బయటకు వచ్చారు. గణేశ్ నిమజ్జనం, మల్లన్న స్వామి దర్శనం కోసం శ్రీశైలానికి ఓ బృందం బయలుదేరింది. మూడు బస్సుల్లో శ్రీశైలానికి 150మందితో ప్రయాణికులు బయలుదేరారు. మంటల్లో పూర్తిగా TS15T 8558 అనే బస్సు దగ్ధమైంది. ఘటనాస్థలికి మీర్‌పేట్ పోలీసులు, ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. మంటలను అదుపులోకి అగ్నిమాపక సిబ్బంది తీసుకువచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తుఫాన్ వేళ అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్

భారీ వర్షాల వేళ విజయవాడ కొండ ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలి: మంత్రి నారాయణ

తుఫాన్ వేళ ప్రజా రవాణాకు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలి: మంత్రి జనార్దన్ రెడ్డి

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 08:52 AM