Share News

ఏపీ మంత్రి మండిపల్లి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం

ABN , Publish Date - Sep 23 , 2026 | 07:35 AM

బెంగళూరు నుంచి విజయవాడకు బయలుదేరిన IX2875 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్‌కు సిద్ధమైన అనంతరం తిరిగి బే కు ఈ విమానం చేరుకుంది. I

ఏపీ మంత్రి మండిపల్లి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం
AP Minister Mandipalli Ramprasad Reddy

అమరావతి, సెప్టెంబర్ 23 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు నుంచి విజయవాడకు బయలుదేరిన IX2875 విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. టేకాఫ్‌కు సిద్ధమైన అనంతరం తిరిగి బే కు ఈ విమానం చేరుకుంది. IX2875 విమానంలో ఆంధ్రప్రదేశ్ మంత్రి మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి (AP Minister Mandipalli Ramprasad Reddy) సహా పలువురు ప్రముకులు ఉన్నారు. ఈరోజు (బుధవారం) మంగళగిరిలోని వెలగపూడి సచివాలయంలో జరగనున్న కేబినెట్ సమావేశానికి మంత్రి హాజరు కానున్నారు.


ఈ నేపథ్యంలోనే మంత్రి మండిపల్లి ఈ విమానంలో ప్రయాణించారు. విమానం ఎప్పుడు బయలుదేరుతుందనే విషయంపై ఇంకా ఉత్కంఠత కొనసాగుతోంది. ప్రయాణికులకు ఇప్పటివరకు విమాన సిబ్బంది స్పష్టమైన సమాచారం ఇవ్వలేదు. ఈ విమానం ఆలస్యం కావడంతో ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. సాంకేతిక లోపం పరిష్కారమై.. అధికారిక అప్‌డేట్ కోసం ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

HAM మోడల్‌తో చాలా వినూత్నంగా ముందుకెళ్తున్నాం: సీఎం చంద్రబాబు

స్థానిక ఎన్నికల్లో జనసేన గౌరవం తగ్గకుండా చూస్తా: పవన్ కల్యాణ్

స్థానిక సంస్థల ఎన్నికల్లో తగ్గేదేలే: మంత్రి లోకేశ్

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 23 , 2026 | 07:44 AM