గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ మహా గణపయ్య
ABN , Publish Date - Sep 25 , 2026 | 02:29 PM
గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణపయ్య చేరుకున్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ క్రేన్ నంబర్ - 4 దగ్గర పంచముఖ సంకట హర మహా గణపతిని నిమజ్జనం చేశారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 25 (ఆంధ్రజ్యోతి): గంగమ్మ ఒడికి ఖైరతాబాద్ మహా గణపయ్య (Khairatabad Bada Ganesh immersion) చేరుకున్నారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్ క్రేన్ నంబర్ - 4 దగ్గర పంచముఖ సంకట హర మహా గణపతిని నిమజ్జనం చేశారు. గణనాథుడికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం గంగమ్మ ఒడికి చేర్చారు. లంబోదరుడిని చూడటానికి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తుల రద్దీ నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్త జన సంద్రంగా ఆ ప్రాంతంమొత్తం మారింది. సెక్రటేరియట్ సౌత్ ఈస్ట్ మార్గంలో భక్తులు కిక్కిరిసి పోయారు.



అప్పర్ ట్యాంక్ బండ్‌పై కోలాహలంగా నిమజ్జనోత్సవాలు

కాగా, అప్పర్ ట్యాంక్ బండ్‌పై అత్యంత కోలాహలంగా వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవాలు కొనసాగుతున్నాయి. జంట నగరాల నుంచి భారీగా విగ్రహాలు తరలివస్తున్నాయి. 12 క్రేన్ల ద్వారా నిమజ్జనం ప్రక్రియ కొనసాగుతోంది. భద్రతకోసం పోలీస్ కంట్రోల్ రూం ద్వారా 58 సీసీటీవీ కెమెరాలతో పోలీసులు పటిష్ఠ నిఘా ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం పూర్తి అయ్యేలా అప్పర్ ట్యాంక్ బండ్‌పై భారీగా పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. ప్రతి క్రేన్ వద్ద ఒక ఎస్ఐ, ఐదుగురు పోలీస్ సిబ్బందితో పర్యవేక్షిస్తున్నారు. నిమజ్జన ప్రాంతాల్లో రంగంలోకి 25 క్రైమ్ టీమ్స్, 10 షీ టీమ్స్ బృందాలు విధులు నిర్వహిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 479 విగ్రహాల నిమజ్జనం పూర్తి అయ్యాయని పోలీసులు పేర్కొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..
ఫిరాయింపు తప్పే.. దానం నాగేందర్‌కు సుప్రీంకోర్టు బిగ్ షాక్
తెలంగాణలో భూ అక్రమాలపై ప్రత్యేక కమిటీ విచారణ
ట్రావెల్స్ బస్సులో భారీ అగ్నిప్రమాదం.. ప్రయాణికులు సురక్షితం
Read Latest Telangana News And AP News And National News
And Telugu News