ఏపీ వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
ABN , Publish Date - Sep 27 , 2026 | 03:57 PM
ఆంధ్రప్రదేశ్ స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
అమరావతి, సెప్టెంబర్ 27 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ స్వర్ణ వార్డు సచివాలయ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఈ ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు (G.O.MS.No. 244) జారీ చేసింది. వార్డు సచివాలయ సిబ్బందికి ప్రమోషన్ ఛానెల్‌ను సుగమం చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మిగులు పోస్టుల సర్దుబాటు ద్వారా మునిసిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో కొత్తగా 815 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల కల్పనకు ఏపీ సర్కార్ ఆమోదం తెలిపింది.
అర్హత కలిగిన వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలకు నూతనంగా క్రియేట్ చేసిన జూనియర్ అసిస్టెంట్ పోస్టుల్లోకి ప్రమోషన్లను కూటమి ప్రభుత్వం కల్పించింది. వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీల ప్రమోషన్ల అనంతరం, వార్డు డేటా ప్రాసెసింగ్ సెక్రటరీలకు వార్డు అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలుగా పదోన్నతులను కల్పించింది. 815 వార్డు శానిటేషన్, ఎన్విరాన్‌మెంట్ సెక్రటరీ (గ్రేడ్-II) పోస్టులను గ్రేడ్-Iగా ప్రభుత్వం అప్‌గ్రేడ్ చేసింది. 815 వార్డు ప్లానింగ్, రెగ్యులేషన్ సెక్రటరీ (గ్రేడ్-II) పోస్టులను కూడా గ్రేడ్-I హోదాకు అప్‌గ్రేడ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ ప్రభుత్వానికి ఎలాంటి అదనపు ఆర్థిక భారం లేకుండా ఈ పోస్టుల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియను పూర్తి చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి..
అదానీ గ్రూప్ ఎనర్జీ మానిటరింగ్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి లోకేశ్
స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యం: మంత్రి పార్థసారథి
కర్నూలు ఎయిర్‌పోర్టు వేదికగా ఏవియేషన్ శిక్షణ: మంత్రి జనార్దన్ రెడ్డి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News