శవ రాజకీయాలు చేసే స్థాయికి వైసీపీ నేతలు దిగజారారు: మంత్రి నిమ్మల
ABN , Publish Date - Sep 27 , 2026 | 05:27 PM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా చనిపోతే శవ రాజకీయాలు చేసే స్థాయికి వైసీపీ నేతలు దిగజారారని ఎద్దేవా చేశారు.
పశ్చిమగోదావరి జిల్లా, సెప్టెంబర్ 27 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు (Nimmala Ramanaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరైనా చనిపోతే శవ రాజకీయాలు చేసే స్థాయికి వైసీపీ నేతలు దిగజారారని ఎద్దేవా చేశారు. ఈరోజు (ఆదివారం) పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు నియోజకవర్గంలో రూ.1.98 లక్షలతో పలు పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మాట్లాడారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో రైతుల, వ్యవసాయం వైపు ఎందుకు కన్నెత్తి చూడలేదని ప్రశ్నించారు.
48 గంటల్లోగా డబ్బులను రైతన్నల బ్యాంకుల ఖాతాల్లో జమ చేస్తున్నాం..
వైసీపీ పాలనలో రైతన్నలు ధాన్యాన్ని నచ్చిన రైస్ మిల్లుకు అమ్ముకునే స్వేచ్ఛ ఉండేది కాదని మంత్రి నిమ్మల తెలిపారు. ధాన్యాన్ని అమ్మాలంటే రైస్ మిల్లుల వద్ద వారం, పది రోజుల పాటు పడిగాపులు పడాల్సి వచ్చేదని చెప్పుకొచ్చారు. కూటమి ప్రభుత్వంలో అన్నదాతలు ధాన్యాన్ని నచ్చిన రైస్ మిల్లుకు అమ్ముకునే స్వేచ్ఛ ఉందని వెల్లడించారు. ధాన్యం అమ్మిన 48 గంటల్లోగా డబ్బులను రైతన్నల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తున్నామని స్పష్టం చేశారు. ఏపీలో సూపర్ ఎల్‌నినో పరిస్థితి ఉన్నా, ఉభయగోదావరి జిల్లాల్లో పది లక్షల నలభై వేల ఎకరాలకు సాగునీరు అందించామని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అదానీ గ్రూప్ ఎనర్జీ మానిటరింగ్ సెంటర్‌ను సందర్శించిన మంత్రి లోకేశ్
స్థానిక ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించడమే లక్ష్యం: మంత్రి పార్థసారథి
కర్నూలు ఎయిర్‌పోర్టు వేదికగా ఏవియేషన్ శిక్షణ: మంత్రి జనార్దన్ రెడ్డి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News