హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలి: విజయసాయి రెడ్డి
ABN , Publish Date - Sep 28 , 2026 | 09:19 AM
విభజన తర్వాత కూడా తెలంగాణలోనే 500 మందికిపైగా ఏపీ హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు.
అమరావతి, సెప్టెంబర్ 28 (ఆంధ్రజ్యోతి): విభజన తర్వాత కూడా తెలంగాణలోనే 500 మందికిపైగా ఏపీ హోంగార్డులు విధులు నిర్వహిస్తున్నారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijayasai Reddy) పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన పోస్టు పెట్టారు.
రెండు రాష్ట్రాల్లోనూ సంక్షేమ ప్రయోజనాలు అందక హోంగార్డులు ఇబ్బందులు పడుతున్నారని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. ఏపీకి ఆ హోంగార్డులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. వారిని వీలైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించాలని విజయసాయిరెడ్డి కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
విశాఖలో మీడియా సమావేశం పెడతా.. ఆ విషయాలపై మాట్లాడతా: విజయసాయి రెడ్డి
శవ రాజకీయాలు చేసే స్థాయికి వైసీపీ నేతలు దిగజారారు: మంత్రి నిమ్మల
Read Latest AP News And Telangana News And National News
And Telugu News