372 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన మంత్రి లోకేశ్
ABN , Publish Date - Sep 28 , 2026 | 08:30 AM
ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ 372 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. తాడేపల్లి మండలం కుంచనపల్లిలో ’మన ఇల్లు – మన లోకేశ్’ కార్యక్రమం నిర్వహించారు.
అమరావతి, సెప్టెంబర్ 28 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) 372 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. తాడేపల్లి మండలం కుంచనపల్లిలో ’మన ఇల్లు – మన లోకేశ్’ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ శ్రీనివాస కన్వెన్షన్స్‌లో పట్టాల పంపిణీలో లోకేశ్ పాల్గొన్నారు. దీర్ఘకాలంగా ప్రభుత్వ భూముల్లో నివసిస్తున్న లబ్ధిదారులకు శాశ్వత పట్టాలను పంపిణీ చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పట్టాల సమస్య పరిష్కారానికి లోకేశ్ చర్యలు చేపట్టారు.
ఇప్పటికే నియోజకవర్గంలో దాదాపు 80 శాతం పట్టాల సమస్య పరిష్కారమైందని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. మిగిలిన కేంద్ర ప్రభుత్వ భూముల సమస్యల పరిష్కారానికి సంప్రదింపులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. తొలి విడతలో 3,002 మందికి పట్టాలను పంపిణీ చేశారు. రెండో విడతలో 2,634 మందికి పట్టాలు అందజేశారు. మొదటి రెండు విడతల్లో దాదాపు రూ.2 వేల కోట్ల విలువైన భూములకు ఉచిత శాశ్వత పట్టాలను పంపిణీ చేశారు. అటవీ, ఇరిగేషన్, రెవెన్యూ, దేవాదాయ, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ భూముల్లో నివసిస్తున్న పేదలకు హక్కులు కల్పించే చర్యలు చేపట్టారు. వివిధ శాఖల సమన్వయంతో భూముల సమస్యలను పరిష్కరించి పట్టాల పంపిణీని మంత్రి లోకేశ్ చేపట్టారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ వార్డు సచివాలయ ఉద్యోగులకు శుభవార్త.. పదోన్నతులకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
విశాఖలో మీడియా సమావేశం పెడతా.. ఆ విషయాలపై మాట్లాడతా: విజయసాయి రెడ్డి
శవ రాజకీయాలు చేసే స్థాయికి వైసీపీ నేతలు దిగజారారు: మంత్రి నిమ్మల
Read Latest AP News And Telangana News And National News
And Telugu News