సింగపూర్ హోం మంత్రి షణ్ముగంతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న లోకేశ్
ABN , Publish Date - Sep 29 , 2026 | 07:13 AM
తిరుమలేశుడిని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ మంగళవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వేంకటేశ్వరస్వామికి లోకేశ్ ప్రత్యేక పూజలు చేశారు.
తిరుమల, సెప్టెంబర్ 29 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఈరోజు (మంగళవారం) ఉదయం సింగపూర్ హోంమంత్రి కే.షణ్ముగంతో కలిసి కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమలేశుడిని దర్శించుకునేందుకు నిన్న (సోమవారం) రాత్రి తిరుమల చేరుకున్న సింగపూర్ హోంమంత్రి కే.షణ్ముగంకు మంత్రి లోకేశ్ స్వాగతం పలికారు.


అనంతరం ఇవాళ ఉదయం గౌరవ మర్యాదలతో షణ్ముగాన్ని శ్రీవారి దర్శనానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, ఆలయ అర్చకులు వారికి ఘనస్వాగతం పలికారు. ఇరువురు కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.
అంతకుముందు సోమవారం రాత్రి తిరుపతి ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న మంత్రి లోకేశ్‌కు స్థానిక టీడీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు ఘనస్వాగతం పలికారు. నేడు మధ్యాహ్నం తిరుపతి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో కేరళంకు మంత్రి లోకేశ్ వెళ్లనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..
372 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను పంపిణీ చేసిన మంత్రి లోకేశ్
పోలీస్ వ్యవస్థకు కానిస్టేబుళ్లే వెన్నెముక: హోం మంత్రి అనిత
హోంగార్డుల సమస్యలు పరిష్కరించాలి: విజయసాయి రెడ్డి
Read Latest Telangana News And AP News And National News
And Telugu News