ఒలింపిక్‌లో మెడల్ సాధించేలా ఏపీ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర
ABN , Publish Date - Sep 30 , 2026 | 10:27 AM
క్రీడాకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర వ్యాఖ్యానించారు.
అమరావతి, సెప్టెంబర్ 30 (ఆంధ్రజ్యోతి): క్రీడాకారుల సంక్షేమానికి తమ ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తోందని ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర (AP Minister Kollu Ravindra) వ్యాఖ్యానించారు. కెనడాలో జరిగిన కామన్వెల్త్ 75 కిలోల పవర్ లిఫ్టింగ్‌లో ఏపీ ఎక్సైజ్ కానిస్టేబుల్ చంద్రకళ రజత పతకం సాధించిన విషయం తెలిసిందే. ఈరోజు (బుధవారం) చంద్రకళను మంత్రి కొల్లు రవీంద్ర సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఒలింపిక్ క్రీడల్లో ఏపీ నుంచి మెడల్స్ సాధించే విధంగా క్రీడాకారులకు సహకారమందిస్తున్నామని వెల్లడించారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని యువత సద్వినియోగం చేసుకొని క్రీడల్లో రాణించాలని పిలుపునిచ్చారు. క్రీడల్లో రాణించిన వారికి ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పిస్తూ తమ ప్రభుత్వం అండగా నిలుస్తోందని చెప్పుకొచ్చారు. ఏపీ నుంచి ఒలింపిక్ మెడల్ సాధించేలా క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
వైసీపీ నేతలు క్రీడాకారుల జీవితాలతో ఆడుకుంటున్నారు..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హయాంలో మాత్రం మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారిని అవహేళన చేస్తున్నారని మంత్రి ధ్వజమెత్తారు. జగన్ సహా వైసీపీ నేతలు క్రీడాకారుల జీవితాలతో ఆడుకుంటున్నారని ఆగ్రహించారు. గంజాయి బ్యాచ్‌తో క్రీడాకారులు, ఉపాధ్యాయులపై దాడులు చేశారని మండిపడ్డారు. జగన్ అరాచకాల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు.
వెన్నం జ్యోతి సురేఖ ఏపీకి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు: శాప్ చైర్మన్
ఏషియన్ గేమ్స్ 2026లో భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టు స్వర్ణపతకం సాధించిందని ఏపీ శాప్ చైర్మన్ రవి నాయుడు తెలిపారు. ఫైనల్‌లో చైనాను 238–234తో ఓడించి భారత్ ఘన విజయం సాధించిందని వెల్లడించారు. జట్టులో భాగమైన ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణి వెన్నం జ్యోతి సురేఖకు ఇది ఏషియన్ గేమ్స్‌లో 4వ స్వర్ణ పతకమని కొనియాడారు. జ్యోతి సురేఖతో పాటు భారత మహిళల కాంపౌండ్ ఆర్చరీ జట్టులో భాగమైన చికితా తనపర్తి, ప్రతికా ప్రదీప్‌కు అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ ఆర్చరీ వేదికపై జ్యోతి సురేఖ తన ప్రతిభతో భారతదేశం, ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారని ప్రశంసించారు. యువ క్రీడాకారులకు జ్యోతి సురేఖ స్ఫూర్తిదాయకమని శాప్ చైర్మన్ రవి నాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఉద్యోగుల్లో సామర్థ్యాలను పెంచడమే ‘మిషన్ కర్మయోగి’ లక్ష్యం: సీఎం చంద్రబాబు
తిరుమలేశుడిని దర్శించుకున్న మంత్రి లోకేశ్, హోం మంత్రి షణ్ముగం
శాంతిభద్రతల పరిరక్షణలో పోలీసులు నిబద్ధత, క్రమశిక్షణతో పనిచేయాలి: మంత్రి
Read Latest AP News And Telangana News And National News
And Telugu News