Share News

నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి: అనంత్‌ అంబానీ

ABN , Publish Date - Oct 02 , 2026 | 12:24 PM

‘ఆంధ్ర భూమి.. సువర్ణ భూమి.. నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి. రాష్ట్రానికి నేనేం చేయగలనో గైడ్ చేయాలి’ అని సీఎం చంద్రబాబును రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అనంత్ అంబానీ కోరారు. గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి: అనంత్‌ అంబానీ
Anant Ambani

అన్నమయ్య జిల్లా: ‘ఆంధ్ర భూమి.. సువర్ణ భూమి.. నన్ను ఆంధ్ర బిడ్డగా భావించండి. రాష్ట్రానికి నేనేం చేయగలనో గైడ్ చేయాలి’ అని సీఎం చంద్రబాబును రిలయన్స్ ఇండస్ట్రీస్ ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్ అనంత్ అంబానీ (Anant Ambani) కోరారు. గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌, ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ అగ్రికల్చర్‌కు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌కు ఈరోజు (శుక్రవారం) శంకుస్థాపన చేశారు.


దేశ ఆర్థికాభివృద్ధికి నిర్మలా సీతారామన్‌ ఎన్నో ప్రణాళికలు చేశారు..

ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్, మంత్రి లోకేశ్, అనంత్ అంబానీ పాల్గొన్నారు. రూ.లక్ష కోట్లతో రాయలసీమ హార్టికల్చర్‌ హబ్‌‌ను ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. ఈ సందర్భంగా అనంత్ అంబానీ మాట్లాడారు. దేశ ఆర్థికాభివృద్ధికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ ఎన్నో ప్రణాళికలు చేశారని ఉద్ఘాటించారు. ఏపీలో పంచాయతీల బలోపేతానికి డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ విశేషంగా కృషి చేస్తున్నారని అనంత్‌ అంబానీ పేర్కొన్నారు.


అనంత్ అంబానీకి ప్రశంసలు..

గ్లోబల్ హార్టికల్చర్ హబ్, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ శంకుస్థాపన కార్యక్రమంలో తన ప్రసంగంతో ఆయన ఆకట్టుకున్నారు. ప్రసంగం అనంతరం అనంత్ అంబానీని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ ప్రశంసించారు. ఈ సందర్భంగా ఆయనను అప్యాయంగా సీఎం చంద్రబాబు ఆలింగనం చేసుకున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

స్వర్ణాంధ్ర విజన్ - 2047 లక్ష్యంగా ఏపీ ముందుకెళ్తుంది: గవర్నర్ కంభంపాటి

రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35.. ఒక్కో కార్డుదారుడికి 2 కిలోల పంపిణీ: మంత్రి నాదెండ్ల

ఒలింపిక్‌లో మెడల్ సాధించేలా ఏపీ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 02 , 2026 | 01:45 PM