రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తయారు చేస్తాం: సీఎం చంద్రబాబు
ABN , Publish Date - Oct 02 , 2026 | 01:31 PM
రాయలసీమను రూ.లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తయారు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు శుక్రవారం శంకుస్థాపన చేశారు.
అన్నమయ్య జిల్లా: రాయలసీమను రూ.లక్ష కోట్లతో గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా తయారు చేస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో రాయలసీమ హార్టికల్చర్ హబ్‌కు ఈరోజు (శుక్రవారం) శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, అనంత్ అంబానీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు.
అనంత్ అంబానీ తెలుగు బిడ్డ..
‘ఇవాళ్టి నుంచి అనంత్ అంబానీ తెలుగు బిడ్డ.. మనందరి ముద్దు బిడ్డ’ అని ప్రశంసించారు. అనంత్ అంబానీ ఏ ప్రాజెక్ట్ చేపట్టినా విజయవంతం చేస్తారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె ప్రజల ఉత్సాహం అదిరిపోయిందని అన్నారు. కరువుసీమలో గొప్ప కార్యక్రమం చేపట్టామని వివరించారు. కరువు సీమ.. సిరుల సీమ అవుతుందని చెప్పుకొచ్చారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ సహకారంతో రాయలసీమను గ్లోబల్ హార్టికల్చర్ హబ్‌గా మార్చబోతున్నామని ఉద్ఘాటించారు. అన్నదాతకు ఉపయోగపడేలా గ్లోబల్ హార్టికల్చర్ హబ్ ఏర్పాటు చేస్తామని తెలిపారు.
ఏపీ అభివృద్ధికి నిర్మలా సీతారామన్ సహకరిస్తున్నారు..
అక్టోబర్ 2, 2026 రాయలసీమ చరిత్రలో నిలిచిపోతుందని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఈ అభివృద్ధికి కారణం మీరిచ్చిన విజయమేనని చెప్పారు. ఏపీ అభివృద్ధికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ సహకరిస్తున్నారని తెలిపారు. ఏది కావాలని కోరినా అన్నింటికీ ఆమె డబ్బులు ఇస్తున్నారని ప్రశంసించారు. విశాఖపట్నం ఉక్కుకు డబ్బులిచ్చి నిలబెట్టారని కొనియాడారు. సాగునీరు ఇస్తే రాయలసీమ ప్రజలు బంగారం పండించగలరని వెల్లడించారు. యాపిల్ నుంచి స్ట్రాబెర్రీ వరకు రాయలసీమ రైతులు పండించగలరని తెలిపారు. అప్పట్లో తనను CEO అని, హైటెక్ సీఎం అని అనేవాళ్లని ప్రస్తావించారు. ఇప్పుడు వాటర్‌మెన్ అంటుంటే సంతోషంగా ఉందని అన్నారు. ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ వ్యవసాయంలో పెనుమార్పులు తీసుకువస్తున్నామని వెల్లడించారు. IIMలో మేనేజ్‌మెంట్ లీడర్లు,.. IIT టెక్నాలజీ నిపుణులు తయారవుతారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
స్వర్ణాంధ్ర విజన్ - 2047 లక్ష్యంగా ఏపీ ముందుకెళ్తుంది: గవర్నర్ కంభంపాటి
రైతు బజార్లలో కిలో ఉల్లి రూ.35.. ఒక్కో కార్డుదారుడికి 2 కిలోల పంపిణీ: మంత్రి నాదెండ్ల
ఒలింపిక్‌లో మెడల్ సాధించేలా ఏపీ క్రీడాకారులను ప్రోత్సహిస్తాం: మంత్రి కొల్లు రవీంద్ర
Read Latest AP News And Telangana News And National News
And Telugu News