Share News

ఏపీలో గృహ నిర్మాణ రంగంలో నూతన శకం ప్రారంభం: పవన్ కల్యాణ్

ABN , Publish Date - Oct 04 , 2026 | 04:06 PM

ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణ రంగంలో ఒక నూతన వినూత్న శకం ప్రారంభమైందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు.

ఏపీలో గృహ నిర్మాణ రంగంలో నూతన శకం ప్రారంభం: పవన్ కల్యాణ్
AP Deputy CM Pawan Kalyan

అమరావతి, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో గృహ నిర్మాణ రంగంలో ఒక నూతన వినూత్న శకం ప్రారంభమైందని ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (AP Deputy CM Pawan Kalyan) వ్యాఖ్యానించారు. గుంటూరు జిల్లా బుర్రిపాలెంలో PMAY-G 2.0 కింద 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేయడంతో ఏపీలో 'అందరికీ ఇళ్లు' లక్ష్యం దిశగా ఒక కీలక అడుగు పడిందని పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పవన్ కల్యాణ్ పోస్టు పెట్టారు. గ్రామీణ గృహ నిర్మాణంలో దేశంలో తొలిసారిగా '3D కాంక్రీట్ ప్రింటింగ్' పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించడం ఈ బృహత్తర కార్యక్రమానికి ఉన్న ప్రత్యేకత అని వివరించారు.


బుర్రిపాలెం, ఓబులనాయుడుపాలెం గ్రామాల్లో మొత్తం 177 ఇళ్లను ఈ సాంకేతికతతో నిర్మిస్తారని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ఈ అత్యాధునిక టెక్నాలజీ ద్వారా ఒక్కో ఇంటిని కేవలం 10 రోజుల్లోనే పూర్తి చేయొచ్చని వివరించారు. అంతేకాకుండా, నిర్మాణ వ్యర్థాలను తగ్గిస్తూ, నాణ్యత, సమర్థతను ఇది మరింత పెంచుతుందని చెప్పుకొచ్చారు. ప్రతి కుటుంబానికి గౌరవప్రదమైన నివాసాన్ని అందించాలనే లక్ష్యంతో ప్రధానమంత్రి నరేంద్రమోదీ పనిచేస్తున్నారని వివరించారు. మోదీ దార్శనిక నాయకత్వానికి, నిరంతర నిబద్ధత ఇదని.. ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు నిరంతరం మద్దతు ఇస్తూ, గ్రామీణ గృహ నిర్మాణంలో నూతన వినూత్న విధానాలను ప్రోత్సహిస్తున్న కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పారు.


ఏపీలోని కూటమి ప్రభుత్వం గృహ నిర్మాణ కార్యక్రమాలను వేగవంతం చేస్తోందని పవన్ కల్యాణ్ వెల్లడించారు. సాంకేతికతతో విస్తృతిని, నాణ్యతతో వేగాన్ని, వినూత్న విధానాలతో సంక్షేమాన్ని జోడిస్తోందని చెప్పుకొచ్చారు. ఈ గృహ నిర్మాణ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లడంలో మద్దతు అందిస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు తెలిపారు. ప్రతి కుటుంబానికి ఒక నీడ, ప్రతి ఇటుకలోనూ ఆధునిక సాంకేతికత, గ్రామీణ ఏపీ అభివృద్ధికి ఒక బలమైన పునాది అని పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఫిబ్రవరి 3న అమరావతి నుంచి తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు

ఆసియా గేమ్స్‌లో భారత్‌కు 19వ స్వర్ణం.. పవన్, లోకేశ్ అభినందనలు

బీసీలకు వైసీపీ అన్యాయం చేసింది.. రామ్మోహన్ ధ్వజం

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Oct 04 , 2026 | 04:58 PM