ప్రజలకు మెరుగైన సేవలే లక్ష్యం.. ఉద్యోగుల శిక్షణపై సీఎం స్పెషల్ ఫోకస్
ABN , Publish Date - Oct 05 , 2026 | 09:17 PM
ప్రభుత్వ ఉద్యోగులకు సామర్థ్యం పెరిగితే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.
అమరావతి, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఉద్యోగులకు సామర్థ్యం పెరిగితే ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. వివిధ శాఖలు అందిస్తున్న పౌరసేవలపై సీఎం చంద్రబాబు ఈరోజు (సోమవారం) రాష్ట్ర సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు రెవెన్యూ ఐటీ, ఆర్థిక, మహిళా శిశు సంక్షేమం, స్కిల్ డెవలప్‌మెంట్, ఐ అండ్ ఐ, సెర్ప్ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ సందర్భంగా అధికారులకు పలు కీలక అంశాలపై సీఎం దిశానిర్దేశం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న క్షేత్రస్థాయి సిబ్బంది, ఉద్యోగులతో త్వరలో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని వెల్లడించారు. కెపాసిటీ బిల్డింగ్ సహా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు ప్రభుత్వ శాఖలు సిద్ధం కావాలని ఆదేశించారు. కెపాసిటీ బిల్డింగ్ కమిషన్, మిషన్ కర్మయోగి పోర్టల్, ఉన్నతి ద్వారా ఆన్‌లైన్ కోర్సులను ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 4200 కోర్సులను పూర్తి చేసిన ఓ ఎస్జీటీ టీచర్ తన సామర్థ్యాలను పెంచుకున్నారని తెలిపారు. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ కోర్సులు నేర్చుకునేలా ఐఐఎం, ఐఐటీలు, యూనివర్సిటీల్లోనూ శిక్షణ తీసుకోవాలని సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
గొడ్డలి పార్టీ పాలనలో 6 లక్షల పేదల ఇళ్లు రద్దు చేశారు: సీఎం చంద్రబాబు
ఏపీలో గృహ నిర్మాణ రంగంలో నూతన శకం ప్రారంభం: పవన్ కల్యాణ్
ప్రజల స్పందనను వక్రీకరించొద్దు.. జై రాం రమేశ్‌కు చంద్రబాబు, లోకేశ్ కౌంటర్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News