తిరువళ్లువర్‌కు కాషాయ రంగు.. బీజేపీపై టీవీకే సెటైర్లు..
ABN , Publish Date - Oct 12 , 2026 | 11:29 AM
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ఒకే వేదికపై కనిపించిన మరుసటి రోజే భారతీయ జనతా పార్టీపై టీవీకే విమర్శలు గుప్పించింది.
ఇంటర్నెట్ డెస్క్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, తమిళనాడు ముఖ్యమంత్రి, తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధ్యక్షుడు విజయ్ ఒకే వేదికపై కనిపించిన మరుసటి రోజే భారతీయ జనతా పార్టీపై టీవీకే విమర్శలు గుప్పించింది. ప్రముఖ తమిళ కవి, తత్వవేత్త తిరువళ్లువర్‌ను బీజేపీ కాషాయ వస్త్రధారణలో చిత్రీకరించడంపై టీవీకే అభ్యంతరం వ్యక్తం చేసింది. తిరువళ్లువర్‌ను ఒక ప్రత్యేక మతానికి పరిమితం చేయలేరని స్పష్టం చేసింది (Thiruvalluvar Saffron Controversy).
అక్టోబర్ 11న చెన్నైలో ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా పోరూర్ ప్రాంతంలోని మెట్రో రైల్వే స్టేషన్ వద్ద స్వాగత ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా బీజేపీ ఏర్పాటు చేసిన ప్రదర్శనలో తిరువళ్లువర్‌ను కాషాయ వస్త్రధారణలో చూపించారు. తమిళ సాహిత్యంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తిగా గుర్తింపు పొందిన తిరువళ్లువర్‌ను ఒక ప్రత్యేక మతానికి చెందిన వ్యక్తిగా చూపించే ప్రయత్నం జరుగుతోందంటూ ఈ చిత్రీకరణపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి (TVK vs BJP).
తిరువళ్లువర్‌ను కాషాయ రంగుతో చిత్రీకరించడం ద్వారా ఆయనను సొంతం చేసుకోలేరని టీవీకే పేర్కొంది (PM Modi Tamil Nadu Visit). తిరువళ్లువర్ తమిళ ప్రజలకే కాకుండా మొత్తం మానవాళికి చెందిన గొప్ప వ్యక్తి అని ప్రశంసించింది. తిరుక్కురళ్ ద్వారా ఆయన ప్రపంచానికి నైతిక విలువలను అందించారని, ఆయన బోధనలను ఒక ప్రత్యేక మతానికి పరిమితం చేయడం సరికాదని పేర్కొంది. తిరువళ్లువర్‌ను కాషాయీకరించే ప్రయత్నాలను తమిళ ప్రజలు అంగీకరించరని టీవీకే హెచ్చరించింది. తమిళ భాష, తమిళ ప్రజల సంస్కృతి, వారసత్వాన్ని కాపాడేందుకు తమ పార్టీ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేసింది.
ఇవి కూడా చదవండి..
కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్.. అయినా ఉక్రెయిన్‌పై రష్యా దాడి!
స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..