Share News

కీవ్ విద్యుత్ కేంద్రంపై దాడి.. ట్రంప్ ప్రకటన చేసినా వెనక్కి తగ్గని రష్యా..

ABN , Publish Date - Oct 12 , 2026 | 10:27 AM

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి తాత్కాలిక విరామం లభిస్తుందని భావించిన వేళ మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి.

కీవ్ విద్యుత్ కేంద్రంపై దాడి.. ట్రంప్ ప్రకటన చేసినా వెనక్కి తగ్గని రష్యా..
Kyiv Power Plant Attack, Volodymyr Zelenskyy

ఇంటర్నెట్ డెస్క్: రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి తాత్కాలిక విరామం లభిస్తుందని భావించిన వేళ మరోసారి ఉద్రిక్తతలు పెరిగాయి. ఇరు దేశాలు ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు నిలిపివేసేందుకు అంగీకరించాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోని విద్యుత్ కేంద్రంపై రష్యా డ్రోన్ దాడి చేసింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు (Kyiv Power Plant Attack).


అంతకుముందు ఖార్కివ్ ప్రాంతంలోని విద్యుత్ కేంద్రాలపైనా దాడులు జరిగినట్లు వెల్లడించారు. అక్టోబర్ 11న కీవ్‌లోని ఓ విద్యుత్ కేంద్రంపై రష్యాకు చెందిన షాహెద్ డ్రోన్ దాడి చేసినట్లు జెలెన్‌స్కీ తెలిపారు. ఈ దాడి కారణంగా రాజధానిలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. అలాగే తూర్పు ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ ప్రాంతంలోని ఇంధన మౌలిక సదుపాయాలపైనా దాడులు జరిగినట్లు వెల్లడించారు (Russia Ukraine War).


రోజంతా డ్రోన్లు, ఇతర వైమానిక దాడులతో ఉక్రెయిన్‌ను రష్యా లక్ష్యంగా చేసుకుందని జెలెన్‌స్కీ ఆరోపించారు (Russia Ukraine Ceasefire). కాగా, అంతకు ముందు రష్యా, ఉక్రెయిన్ పరస్పరం ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు నిలిపివేసేందుకు అంగీకరించాయని ట్రంప్ తన ట్రూత్ సోషల్‌ ద్వారా ప్రకటించారు. ఈ ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొన్నారు. అయితే, ఈ ప్రకటనలో ఒప్పందానికి సంబంధించిన పూర్తి నిబంధనలు, అమలు విధానం వంటి వివరాలను వెల్లడించలేదు. రష్యా కూడా ఈ ఒప్పందానికి అంగీకరించినట్లు అధికారికంగా ధ్రువీకరించలేదు.


ఇవి కూడా చదవండి..

కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్.. అయినా ఉక్రెయిన్‌పై రష్యా దాడి!


స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 12 , 2026 | 10:27 AM