బంతి బౌండరీ అనుకున్నాడు.. విచిత్రంగా రనౌట్ అయ్యాడు..
ABN , Publish Date - Oct 12 , 2026 | 09:44 AM
భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ అనూహ్య రీతిలో రనౌట్ అయ్యాడు. బంతి బౌండరీకి వెళ్లిపోయిందని భావించి పరుగెత్తడం ఆపేయడంతో వికెట్ కోల్పోయాడు.
ఇంటర్నెట్ డెస్క్: భారత్, వెస్టిండీస్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత యువ బ్యాటర్ తిలక్ వర్మ అనూహ్య రీతిలో రనౌట్ అయ్యాడు. బంతి బౌండరీకి వెళ్లిపోయిందని భావించి పరుగెత్తడం ఆపేయడంతో వికెట్ కోల్పోయాడు. మైదానంలో అతడు వ్యవహరించిన తీరు క్రికెట్ అభిమానులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది (Tilak Varma Run Out).
ఆదివారం ఇండోర్‌లోని హోల్కర్ స్టేడియంలో భారత్, వెస్టిండీస్ మధ్య మూడో టీ20 మ్యాచ్ జరిగింది. భారత ఇన్నింగ్స్ 17వ ఓవర్‌లో వెస్టిండీస్ బౌలర్ గుడాకేశ్ మోటి బౌలింగ్‌లో అక్షర్ పటేల్ బంతిని లెగ్ సైడ్ దిశగా ఆడాడు. బంతి బౌండరీ దాటిందని భావించిన అక్షర్ పటేల్, తిలక్ వర్మ ఒక పరుగు పూర్తి చేసిన తర్వాత మైదానం మధ్యలోనే ఆగిపోయారు. ఇద్దరూ బౌండరీ వెళ్లినట్లుగా భావించి పరస్పరం అభినందించుకున్నారు. అయితే, వెస్టిండీస్ ఫీల్డర్ కమిల్ పూరన్ వేగంగా కదిలి బంతిని బౌండరీకి చేరకుండా అడ్డుకున్నాడు. కీపర్‌కు బంతిని అందించాడు (India vs West Indies 3rd T20I).
అక్షర్ పటేల్ ప్రమాదాన్ని గుర్తించి సకాలంలో తన క్రీజులోకి చేరుకున్నాడు (Tilak Varma Video). దీంతో హోప్ బంతిని బౌలర్‌కు అందించాడు. బంతిని అందుకున్న గుడాకేశ్ మోటి బౌలర్ ఎండ్‌లోని వికెట్లను పడగొట్టాడు. అప్పటికీ తిలక్ వర్మ క్రీజుకు బయటే ఉన్నాడు. థర్డ్ అంపైర్ సమీక్షించి అతడిని రనౌట్‌గా ప్రకటించాడు. దీంతో తిలక్ వర్మ షాకయ్యడు.
ఇవి కూడా చదవండి..
కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్.. అయినా ఉక్రెయిన్‌పై రష్యా దాడి!
స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..