Share News

నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Oct 11 , 2026 | 09:37 PM

నెల్లూరులోని పేద ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ పద్ధతిలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు.

నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
CM Chandrababu distribute land pattas in nellure

నెల్లూరు, అక్టోబర్ 11: నెల్లూరులోని పేద ప్రజలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్ పద్ధతిలో ఇళ్ల పట్టాలను పంపిణీ చేశారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజలకు భద్రత, ఆత్మగౌరవం, ఒక ఆస్తి సమకూర్చాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.


అనంతరం ముఖ్యమంత్రి ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. ‘ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా ఉంటున్న వారికి భద్రత కల్పించినందుకు సంతోషంగా ఉంది. రాష్ట్రాన్ని పునర్ నిర్మిస్తామని ఎన్నికల ముందు ప్రధాని నరేంద్రమోదీ, పవన్ కల్యాణ్, నేను హామీ ఇచ్చాం.. ఆ హామీని 28 నెలల పాలనలో నిరూపించాం. ఈ సుపరిపాలనలో భాగమే పేదకుటుంబాలకు శాశ్వత ఇళ్ల పట్టాల పంపిణీ. ఇది పేదలపై కూటమి ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం’ అని అన్నారు.


‘రాష్ట్రమంతా ఒక ఉద్యమంలా పేదలకు శాశ్వత ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం. విశాఖ, విజయవాడ, మంగళగిరిలో 60 వేల కుటుంబాలకు రూ.52,000 కోట్ల విలువైన ఆస్తిని ఇళ్ల పట్టాల రూపంలో ఇచ్చాం. వచ్చే సంక్రాంతి కల్లా.. నెల్లూరు నగరంలోని 4,000 పేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలిస్తామని మాట ఇస్తున్నా.. మహిళా సాధికారత కల్పించడంలో భాగంగా ఈ ఇళ్ల పట్టాలల్లో 701 పట్టాలను మహిళలకు కేటాయించాం. సంక్షేమ పథకాల అమలులో ఎక్కడా రాజీ పడటం లేదు. వేల కోట్ల రూపాయలు ప్రతీ నెలా సామాజిక పింఛన్ల కోసం ఖర్చు చేస్తున్నాం. పట్టణాలు, గ్రామాల్లో మౌలిక వసతుల కల్పన కోసం సుమారు రూ.1.80 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాం. స్త్రీ శక్తి ఉచిత ప్రయాణ పథకం కింద ఇప్పటికే 100 కోట్ల ప్రయాణాలను మహిళలు ఉపయోగించుకున్నారు. బుర్రిపాలెం నుంచి మొన్ననే 3 లక్షల ఇళ్లకు శంకుస్థాపన చేశాం. ఇప్పటికే 5.50 లక్షల ఇళ్లు అందించాం. రాష్ట్రంలో పేదరికం అనేది లేకుండా పీ4 వంటి కార్యక్రమాలు తీసుకువచ్చాం. ఆర్థిక అసమానతలు తగ్గించాలన్నదే నా సంకల్పం. కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ట్రిపుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. నీతి, నిజాయితీ, నిస్వార్థంగా పనిచేసే నాయకులను గెలిపించాలి’ అని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు.


ఈ వార్తలు కూడా చదవండి:

లోక కల్యాణం కోసం నిత్య పెళ్లికొడుకుగా...

అధికమాసం...నవరాత్రి బ్రహ్మోత్సవాలివి...

Read Latest AP News And Telangana News

Updated Date - Oct 11 , 2026 | 09:52 PM