కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్.. అయినా ఉక్రెయిన్‌పై రష్యా దాడి!
ABN , Publish Date - Oct 12 , 2026 | 07:41 AM
ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ విద్యుత్ కేంద్రంపై రష్యా దాడి చేసింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఇంధన కేంద్రాలపై దాడులు నిలిపివేసే ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల తర్వాత ఈ దాడి జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌లోని ఖార్కివ్ విద్యుత్ కేంద్రంపై రష్యా దాడి చేసింది. రష్యా, ఉక్రెయిన్ మధ్య ఇంధన కేంద్రాలపై దాడులు నిలిపివేసే ఒప్పందం కుదిరిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన కొద్ది గంటల తర్వాత ఈ దాడి జరిగింది. ఖార్కివ్ విద్యుత్ కేంద్రంపై రష్యా దాడి చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ వెల్లడించారు. దీంతో ఇరు దేశాల మధ్య ప్రతిపాదిత కాల్పుల విరమణపై మరోసారి సందేహాలు వ్యక్తమవుతున్నాయి (Kharkiv Power Plant Attack).
ఉక్రెయిన్‌లోని కీలక నగరమైన ఖార్కివ్‌లో ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్ నంబర్-5 (సీహెచ్‌పీ-5)పై రష్యా దాడి చేసినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు. ఈ విద్యుత్ కేంద్రం నగరానికి విద్యుత్తుతో పాటు వేడి సరఫరా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ట్రంప్ అక్టోబర్ 11న ఇంధన కేంద్రాలపై దాడులు నిలిపివేసే ఒప్పందం తక్షణమే అమల్లోకి వస్తుందని ప్రకటించిన నేపథ్యంలో ఈ దాడి జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. కీవ్‌లోని విద్యుత్ కేంద్రంపైనా రష్యా దాడి చేసినట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు వెల్లడించారు (Russia Ukraine War).
రష్యా, ఉక్రెయిన్ పరస్పరం ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు నిలిపివేయడానికి అంగీకరించాయని ట్రంప్ సామాజిక మాధ్యమ వేదిక ట్రూత్ సోషల్‌లో ప్రకటించారు (Trump Energy Ceasefire). ట్రంప్ ప్రకటన చేసినప్పటికీ, ఇరు దేశాల నుంచి ఒప్పంద నిబంధనలపై పూర్తి నిర్ధారణ రాలేదు. ట్రంప్ ప్రకటన వెలువడే సమయానికి తమకు కాల్పుల విరమణకు సంబంధించిన పూర్తి సమాచారం అందలేదని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. రష్యా దాడులు నిలిపివేస్తే ఉక్రెయిన్ కూడా కాల్పుల విరమణకు సిద్ధంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
ఈ వార్తలనూ చదవండి...
నెల్లూరులో ఇళ్ల పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు
రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్