Share News

రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్

ABN , Publish Date - Oct 05 , 2026 | 01:11 PM

కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో ఏ ప్రాజెక్టు పూర్తిచేయలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకోలేదని పేర్కొన్నారు.

రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దు: పవన్ కల్యాణ్
AP Deputy CM Pawan Kalyan

కడప, అక్టోబర్ 05: జిల్లాలోని ప్రొద్దుటూరులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ హయాంలో ఏ ప్రాజెక్టు పూర్తిచేయలేదని ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్ విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో కేంద్ర నిధులను సద్వినియోగం చేసుకోలేదని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ పాలనలో జల్‌జీవన్‌ పథకాన్ని మళ్లీ పొడిగించుకున్నామని గుర్తు చేశారు. మీ ఆవేశం తనకు అర్థమవుతోందని కార్యకర్తలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.


అయితే ఇది రాజకీయాలు మాట్లాడే సమయం కాదని అన్నారు. రాయలసీమ అభివృద్ధి సభలో రాజకీయాలు వద్దని డిప్యూటీ సీఎం చెప్పారు. యుద్ధం వచ్చినప్పుడే కదా మాట్లాడాల్సిందని పేర్కొన్నారు. ప్రత్యర్థి హద్దు మీరితేనే యుద్ధం చేసేదని స్పష్టం చేశారు. సోమవారం కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో ‘జల్ జీవన్ మిషన్’, ‘అమరజీవి జలధార’ పథకాలను సీఎం చంద్రబాబు నాయుడితో కలిసి ఆయన ప్రారంభించారు.


అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. కేంద్రం సహకారంతో గతంలో లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు వివరించారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో రూ.6 వేల కోట్లతో పనులు చేపట్టామని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

భీమ్‌గల్ పీఎస్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. పోలీసులే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ

పేట్ బషీరాబాద్‌లో వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి.. కేసు నమోదు

Updated Date - Oct 05 , 2026 | 01:33 PM