Share News

భీమ్‌గల్ పీఎస్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. పోలీసులే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ

ABN , Publish Date - Oct 05 , 2026 | 12:31 PM

నిజామాబాద్ జిల్లాలోని భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో సుధాకర్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు.

భీమ్‌గల్ పీఎస్‌లో వ్యక్తి ఆత్మహత్యాయత్నం.. పోలీసులే కారణమని కుటుంబ సభ్యుల ఆరోపణ

నిజామాబాద్, అక్టోబర్ 12: జిల్లాలోని భీమ్‌గల్ పోలీస్ స్టేషన్‌లో సుధాకర్ అనే వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. దీంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. మెరుగైన వైద్య చికిత్స కోసం అతడిని ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసుల వేధింపుల వల్లే సుధాకర్ ఆత్మాహత్యాయత్నానికి పాల్పడ్డాడని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు.


భీమ్‌గల్ పట్టణంలో సుధాకర్ హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అయితే రాత్రి 10.00 గంటల తర్వాత హోటల్‌లోని టేబుళ్లు బయట రహదారి పక్కన పెట్టాడు. గస్తీ విధులు నిర్వహిస్తున్న పోలీసులు.. రహదారిపై ఆ టేబుళ్లు తీయాలని సుధాకర్‌ను ఆదేశించారు. అతడు కాస్తా ముక్త సరిగా సమాధానం ఇచ్చాడు. దీంతో ఆ టేబుళ్లను అక్కడి నుంచి పోలీసులు తరలించారు. ఈ సందర్భంగా టేబుళ్లను వదిలి వెళ్లాలంటూ పోలీసులను సుధాకర్ బతిమిలాడాడు.


కానీ వాటిని వారు వదిలి వెళ్లలేదు. సుధాకర్‌‌పై ఎస్ఐ తిరుపతి కేసు నమోదు చేశారు. ఇక సోమవారం కోర్టుకు వెళ్లాలంటూ సుధాకర్‌ను పోలీస్ స్టేషన్‌కు పోలీసులు పిలిపించారు. దీంతో అతడు తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దాంతో తన వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ తన ఒంటిపై పోసుకుని నిప్పింటించుకున్నాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. అతడి పరిస్థితి విషమంగా మారింది. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్య చికిత్స కోసం అతడిని ఆర్మూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.


ఇవి కూడా చదవండి...

పేట్ బషీరాబాద్‌లో వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి.. కేసు నమోదు

ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారంటూ వృద్ధుడికి బెదిరింపులు.. లక్షల్లో వసూలు

Updated Date - Oct 05 , 2026 | 12:58 PM