పేట్ బషీరాబాద్‌లో వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి.. కేసు నమోదు
ABN , Publish Date - Oct 05 , 2026 | 09:05 AM
పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యాపారవేత్త అనుమానాస్పద రీతిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఆ మృతదేహం గుండ్లపోచంపల్లికి చెందిన నేమారం చౌదరిగా పోలీసులు గుర్తించారు.
హైదరాబాద్, అక్టోబర్ 05: పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యాపారవేత్త అనుమానాస్పద రీతిలో మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. ఆ మృతదేహం గుండ్లపోచంపల్లికి చెందిన నేమారం చౌదరిగా పోలీసులు గుర్తించారు. ఈ హత్యపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల కథనం ప్రకారం.. నేమారం చౌదరి రెండు రోజుల క్రితం ఇంటి నుంచి రూ.10 లక్షలు తీసుకెళ్లారు. ఆ తర్వాత అతడి ఆచూకీ తెలియలేదు. ఈ నేపథ్యంలో నేమారం చౌదరి కుటుంబ సభ్యులు పోలీసుకు ఫిర్యాదు చేశారు. దీంతో మిస్సింగ్ కేసును పోలీసులు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఈ క్రమంలో సోమవారం తెల్లవారుజామున చెరువు కట్టపై నేమారం చౌదరి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అయితే అతడి మృతదేహం వద్ద రూ.10 లక్షల కనిపించకపోవడంతో పలు సందేహాలకు తావిస్తోంది. దీంతో హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ నగదు కోసమే అతడిని హత్య చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈ కేసు దర్యా్ప్తులో భాగంగా.. అతడి కుటుంబ సభ్యులతోపాటు పరిచయస్తులను పోలీసులు ప్రశ్నిస్తున్నారు. మృతుడు నేమారం చౌదరికి భార్యతోపాటు నలుగురు పిల్లలు ఉన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి
ఏపీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులు.. రూ.1,15,500 వరకు జీతం