అనకాపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం.. భార్యాభర్తలు మృతి
ABN , Publish Date - Oct 05 , 2026 | 08:41 AM
అనకాపల్లి జిల్లాలోని ఎలమంచిలి మండలం పులపర్తి జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భార్యాభర్తలను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు.
అనకాపల్లి, అక్టోబర్ 05: జిల్లాలోని ఎలమంచిలి మండలం పులపర్తి జంక్షన్ సమీపంలోని జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సైకిల్‌పై వెళ్తున్న భార్యాభర్తలను గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారు. వాహనదారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను స్వాధీనం చేసుకుని.. పోస్ట్‌మార్టం నిమిత్తం అనకాపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతి చెందిన భార్యభర్తలు పులపర్తి గ్రామానికి చెందిన పాపారావు, అమ్మాజీలని పోలీసులకు స్థానికులు తెలిపారు. ఈ రోజు తెల్లవారుజామున పాలు తీసేందుకు పొలం వద్దకు వెళ్తుండగా వారిని వాహనం ఢీ కొట్టిందని వివరించారు. ఈ ప్రమాద స్థలానికి సమీపంలోని సీసీ టీవీ కెమెరాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులు.. రూ.1,15,500 వరకు జీతం
నిరాశాజనకంగా ముగిసిన ‘నైరుతి’ ఆదుకున్న తీవ్ర వాయుగుండం