Share News

ఏపీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులు.. రూ.1,15,500 వరకు జీతం

ABN , Publish Date - Oct 05 , 2026 | 08:07 AM

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC).. రాష్ట్రంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఏపీపీఎస్సీ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టులు.. రూ.1,15,500 వరకు జీతం

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC).. రాష్ట్రంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, బీసీ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీసుల్లో మొత్తం 73 ఖాళీలను భర్తీ చేయనుంది.

అర్హత గల అభ్యర్థులు 2026 అక్టోబర్ 9 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ 2026, అక్టోబర్ 29. డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.


పోస్టుల వివరాలు..

హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్-2

విభాగాలు: సోషల్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్: 21 పోస్టులు

ట్రైబర్ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్: 23 పోస్టులు

బీసీ వెల్ఫేర్ సబార్డినేట్ సర్వీస్: 29 పోస్టులు

మొత్తం ఖాళీలు: 73


జీతం: నెలకు రూ.37,640 నుంచి రూ.1,15,500 వరకు ఉంటుంది.

అర్హత: సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి.

ఎంపిక విధానం: సింగిల్ లెవెల్ ఆన్‌లైన్ కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. (2 పేపర్లు.. మొత్తం మార్కులు 150)

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా..

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 09-10-2026

దరఖాస్తుకు చివరి తేదీ: 29-10-2026


null

Updated Date - Oct 05 , 2026 | 08:21 AM