ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారంటూ వృద్ధుడికి బెదిరింపులు.. లక్షల్లో వసూలు
ABN , Publish Date - Oct 05 , 2026 | 09:38 AM
ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారంటూ వృద్ధుడిని బెదిరించి.. లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. షేట్‌బషీర్‌బాద్‌కు చెందిన 72 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసం చేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 5: ఉగ్రవాదులకు నిధులు సమకూర్చారంటూ వృద్ధుడిని బెదిరించి.. లక్షల్లో డబ్బులు వసూలు చేసిన ఘటన నగరంలో చోటు చేసుకుంది. షేట్‌బషీర్‌బాద్‌కు చెందిన 72 ఏళ్ల వృద్ధుడిని సైబర్ నేరగాళ్లు దారుణంగా మోసం చేశారు. ముంబై పోలీస్ అధికారులమంటూ సదరు వృద్ధుడికి సైబర్ కేటుగాళ్లు ఫోన్ చేశారు. రూ.2 కోట్లు ఉగ్రవాద సంస్థలకు సమకూర్చారంటూ బెదిరింపులకు దిగారు. మనీలాండరింగ్ కేసు నమోదైందంటూ భయపెట్టారు. వీడియో కాల్ చేసి ఓ సీనియర్ పోలీస్ అధికారినంటూ మరో వ్యక్తిని వృద్ధుడికి పరిచయం చేశారు.
అంతేకాకుండా విషయం ఎవరికైనా చెబితే కుటుంబసభ్యులను కూడా కేసులో ఇరికిస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు. కేసు నుంచి తప్పించేందుకు డబ్బులు డిమాండ్ చేశారు. కేసు విషయంలో భయాందోళనకు గురైన వృద్ధుడు.. డబ్బులు ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. దీంతో బాధితుడి నుంచి విడతల వారీగా డబ్బులు వసూలు చేశారు. దాదాపు రూ.55.20 లక్షలు కాజేశారు.
చివరకు మోసాన్ని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. వృద్ధుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇలాంటి విషయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మోసపోవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు సూచించారు.
ఇవి కూడా చదవండి...
అంతర్జాతీయ విమానాలపై ఇజ్రాయెల్ సెక్యూరిటీ రివ్యూ
పేట్ బషీరాబాద్‌లో వ్యాపారవేత్త అనుమానాస్పద మృతి.. కేసు నమోదు
Read Latest Telangana News And Telugu News