Share News

నేడు సుప్రీం ముందుకు బీసీ రిజర్వేషన్ల అంశం

ABN , Publish Date - Oct 05 , 2026 | 07:14 AM

ఆంధ్ర ప్రదేశ్‌లో బీసీ రిజర్వేషన్ల వ్యవహారాన్ని సోమవారం సుప్రీంకోర్టు ఎదుట ఏపీ ప్రభుత్వం మెన్షన్‌ చేసే అవకాశమున్నట్లు తెలిసింది

నేడు సుప్రీం ముందుకు బీసీ రిజర్వేషన్ల అంశం
SUPREMECOURT

  • సీజేఐ ధర్మాసనం ఎదుట

  • మెన్షన్‌ చేయనున్న ఏపీ ప్రభుత్వం

న్యూఢిల్లీ, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర ప్రదేశ్‌లో బీసీ రిజర్వేషన్ల వ్యవహారాన్ని సోమవారం సుప్రీంకోర్టు ఎదుట ఏపీ ప్రభుత్వం మెన్షన్‌ చేసే అవకాశమున్నట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ జారీ చేసిన జీవోలను కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం శనివారమే సుప్రీంకోర్టులో సవాల్‌ చేసింది. ఆ పిటిషన్‌లో ప్రభుత్వం కొన్ని అభ్యంతరాలు లేవనెత్తింది. రిజర్వేషన్లను 50 శాతానికే పరిమితం చేయాలనే నిబంధనేమీ లేదని తెలిపింది. ప్రభుత్వ జీవోలతో గ్రామీణ స్థానిక సంస్థల రిజర్వేషన్లు 61.08 శాతానికి చేరినా, పట్టణ స్థానిక సంస్థల రిజర్వేషన్లు మాత్రం 49.24 శాతానికే పరిమితం అవుతున్నాయని పేర్కొంది. అయినా హైకోర్టు 50 శాతం పరిమితి పేరుతో రెండు జీవోలనూ కొట్టివేసిందని తెలిపింది. సమగ్ర వివరాలు ఉంటే అంతకుమించి కూడా ముందుకు వెళ్లొచ్చని గతంలో సుప్రీంకోర్టు కొన్ని కీలక తీర్పు లు ఇచ్చిన అంశాన్ని ఏపీ ప్రభుత్వం ప్రసా ్తవించింది. ఈ అంశాన్ని అత్యవసరంగా విచారి ంచాలని కోరుతూ ఏపీ ప్రభుత్వ తరఫు న్యాయ వాదులు సోమవారం సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని ధర్మాసనం ఎదుట ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసే అవకాశం ఉందని తెలిసింది.

Updated Date - Oct 05 , 2026 | 07:18 AM