Share News

తమిళనాడు ఉప ఎన్నికల్లో సీఎం విజయ్ పార్టీ దూకుడు.. రెండు స్థానాల్లోనూ ఘన విజయం

ABN , Publish Date - Oct 09 , 2026 | 05:00 PM

తమిళనాడులో ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం జోరుపెంచింది. రాష్ట్రంలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ విజయబావుటా ఎగురవేసింది.

తమిళనాడు ఉప ఎన్నికల్లో సీఎం విజయ్ పార్టీ దూకుడు.. రెండు స్థానాల్లోనూ ఘన విజయం
Tamil Nadu By Polls

ఇంటర్నెట్ డెస్క్, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): తమిళనాడులో ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ (CM Joseph Vijay) నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం(TVK) జోరుపెంచింది. రాష్ట్రంలో జరిగిన రెండు ఉప ఎన్నికల్లోనూ (Tamil Nadu By Polls) ఆ పార్టీ విజయబావుటా ఎగురవేసింది. మధురాంతకం, ధారాపురం అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తి అయింది.


మధురాంతకంలో 17 వేల ఓట్లకుపైగా మెజార్టీతో కె.మరగతం కుమారవేల్ ఘన విజయం సాధించారు. ధారాపురంలో 10 వేల ఓట్లకుపైగా మెజార్టీతో పి.సత్యభామ గెలుపొందారు. తొలుత ఈ రెండు స్థానాల్లోనూ కౌంటింగ్ సమయంలో ఉత్కంఠ నెలకొనగా.. చివరకు టీవీకే అభ్యర్థులే గెలిచారు. ముఖ్యంగా మధురాంతకంలో టీవీకే అభ్యర్థి కె.మరగతం కుమారవేల్ క్రమంగా ఆధిక్యం పెంచుకున్నారు.


ధారాపురంలో మాత్రం తొలి రౌండ్లలో AIADMK అభ్యర్థి భానుమతి ఆధిక్యంలో ఉన్నారు. ఆ తర్వాత టీవీకే అభ్యర్థి సత్యభామ పుంజుకుని ముందంజలోకి వచ్చారు. ఈ రెండు స్థానాల విజయంతో ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. కౌంటింగ్ కేంద్రాల వెలుపల టీవీకే కార్యకర్తలు, అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. విజయ్ ఫొటోలు, టీవీకే జెండాలతో నినాదాలు చేస్తూ విజయోత్సాహం వ్యక్తం చేస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సీఈసీ, కేంద్ర విధానాలపై మా పోరాటం ఆగదు: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణను అత్యుత్తమ పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి: సీఎస్

మహిళా సాధికారతకు కొత్త అడుగు.. జిల్లాల్లో ఇందిరా మహిళా శక్తి భవనాలు: సీఎం రేవంత్‌రెడ్డి

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 09 , 2026 | 06:25 PM