Share News

తెలంగాణను అత్యుత్తమ పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి: సీఎస్

ABN , Publish Date - Oct 07 , 2026 | 04:49 PM

పెట్టుబడులను ఆకర్షించేందుకు సమన్వయంతో సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు ఆదేశించారు.

తెలంగాణను అత్యుత్తమ పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దాలి: సీఎస్
Telangana CS Sanjay Jaju

హైదరాబాద్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): పెట్టుబడులను ఆకర్షించేందుకు సమన్వయంతో సమర్థవంతమైన చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (Telangana CS Sanjay Jaju) ఆదేశించారు. ఇన్వెస్ట్ తెలంగాణ తొలి గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్ని సీఎస్ సంజయ్ జాజు అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు (బుధవారం) నిర్వహించారు. తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ పెట్టుబడి గమ్యస్థానంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని మరింత బలోపేతం చేయాలని సీఎస్ ఆదేశించారు.


తెలంగాణను అగ్రగామిగా నిలపాలి..

పారిశ్రామికవేత్తలకు వేగవంతమైన అనుమతులు, మౌలిక వసతులు కల్పించాలని సీఎస్ సంజయ్ జాజు సూచించారు. పెట్టుబడుల అవకాశాలను దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో విస్తృతంగా ప్రచారం చేయాలని దిశానిర్దేశం చేశారు. ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన సంస్థలతో నిరంతరం సమన్వయం కొనసాగించాలని సూచించారు. పెట్టుబడుల ప్రతిపాదనలను వేగంగా పరిశీలించి కాలపరిమితిలో కార్యరూపం దాల్చేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వివిధ శాఖల మధ్య సమన్వయంతో పెట్టుబడుల ప్రక్రియను వేగవంతం చేయాలని మార్గనిర్దేశం చేశారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యాలకు అనుగుణంగా ఇన్వెస్ట్ తెలంగాణ కీలక వేదిక కానుందని వెల్లడించారు. పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి కల్పనలో తెలంగాణను అగ్రగామిగా నిలపాలని సీఎస్ సంజయ్ జాజు సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఎర్రవల్లిలో ఆ భూముల లెక్కలు తేల్చండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

కేంద్ర కేబినెట్‌లో కీలక నిర్ణయాలు.. ITLA, SME ఫండ్స్‌కు గ్రీన్‌సిగ్నల్

మాదకద్రవ్యాల రహిత సమాజం కోసం యువత ముందుకు రావాలి: గవర్నర్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 07 , 2026 | 05:04 PM