Share News

ఎర్రవల్లిలో ఆ భూముల లెక్కలు తేల్చండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు

ABN , Publish Date - Oct 06 , 2026 | 08:36 PM

సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల భూముల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు గ్రామాల్లో సర్వే వివరాలను సీఎంకు అధికారులు వివరించారు.

ఎర్రవల్లిలో ఆ భూముల లెక్కలు తేల్చండి.. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశాలు
Telangan CM Revanth Reddy

సిద్దిపేట జిల్లా, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల భూముల అంశంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangan CM Revanth Reddy) ఈరోజు (మంగళవారం) రాష్ట్ర సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. రెండు గ్రామాల్లో సర్వే వివరాలను సీఎంకు అధికారులు వివరించారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవల్లి గ్రామ పరిధిలోని సర్వే నంబర్ - 325లో మొత్తం 388 ఎకరాల భూమి ఉందని అధికారులు తెలిపారు. రెవెన్యూ అధికారుల సర్వేలో 343 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు గుర్తించారని అన్నారు. ఈ సర్వే నంబర్‌లో 45 ఎకరాల భూమి కనిపించలేదని అధికారులు చెప్పుకొచ్చారు. ఆ 45 ఎకరాలు ఎక్కడుందో తేల్చాలని అధికారులను సీఎం ఆదేశించారు.


ఆ భూమి గుర్తింపు కోసం ఎర్రవల్లి, శివారు వెంకటాపురం గ్రామాల్లో సర్వే నోటిఫికేషన్ విడుదల చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. ఇందులో భాగంగానే ఆ భూమి సరిహద్దులో ఉన్న మాజీ సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులకు రెవెన్యూ రికార్డులు సబ్‌మిట్ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేయనున్నారు. సర్వే నంబర్ - 325లో ఉన్న భూమిని స్థానిక అర్హులైన రైతులకు ప్రభుత్వం పంపిణీ చేయనుంది. సర్వే నంబర్-325లో తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాల కోసం తెలంగాణ అమరవీరుల కాలనీ నిర్మాణం చేయాలని సీఎం ఆదేశించారు.


తెలంగాణ అమరవీరుల కాలనీలో అమరవీరుల కుటుంబాలకు ఇళ్ల స్థలాలు కేటాయించి, సకల సౌకర్యాలతో కాలనీ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. కాలనీ నిర్మాణ బాధ్యతలను హౌసింగ్ బోర్డుకు అప్పగించాలని ఆదేశించారు. జూన్ 2వ తేదీలోగా అమరవీరుల కాలనీ నిర్మాణం పూర్తి చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం: సీఎస్ సంజయ్ జాజు

తెలంగాణలో ‘సర్’ పేరుతో 90 లక్షల ఓట్లు తీసేశారు: మహేశ్ గౌడ్

రామప్పను కాపాడేందుకు పెద్దఎత్తున ఉద్యమిస్తాం: కేటీఆర్

Read Latest Telangana News And AP News And National News

And Telugu News

Updated Date - Oct 06 , 2026 | 09:22 PM