తెలంగాణను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యం: సీఎస్ సంజయ్ జాజు
ABN , Publish Date - Oct 05 , 2026 | 02:51 PM
తెలంగాణను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు పేర్కొన్నారు. డిసెంబర్ 2027 నాటికి 67 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను పూర్తి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.
హైదరాబాద్, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): తెలంగాణను అంతర్జాతీయ విద్యా కేంద్రంగా అభివృద్ధి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు (Telangana Government CS Sanjay Jaju) పేర్కొన్నారు. డిసెంబర్ 2027 నాటికి 67 ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను పూర్తి చేయడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణం, ఫ్యూచర్ సిటీలో విద్యాసంస్థల ఏర్పాటుపై సీఎస్ సంజయ్ జాజు ఈరోజు (సోమవారం) సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై అధికారులకు సీఎస్ దిశానిర్దేశం చేశారు. జూన్ 2028 నాటికి 87 స్కూళ్ల ఏర్పాటుకు ప్రణాళిక చేస్తున్నామని తెలిపారు.
దశలవారీగా యంగ్ ఇండియా స్కూళ్లు ఏర్పాటు..
రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో దశలవారీగా యంగ్ ఇండియా స్కూళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు సీఎస్ వెల్లడించారు. ఒక్కో స్కూల్‌కు సుమారు 26 ఎకరాల్లో ఆధునిక మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పుకొచ్చారు. ఒకే క్యాంపస్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంక్షేమ పాఠశాలలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. క్రీడా మైదానాలు, హాస్టళ్లు, డిజిటల్ క్లాస్‌రూమ్‌లు ఏర్పాటు చేస్తామని అన్నారు. ఫ్యూచర్ సిటీలో విదేశీ యూనివర్సిటీల క్యాంపస్‌లకు ప్రత్యేక విధానం తీసుకువస్తామని చెప్పారు.
ఇందుకోసం లండన్, బర్మింగ్‌హామ్ యూనివర్సిటీలతో పాటు మరో 4 విదేశీ వర్సిటీలు ఆసక్తి చూపిస్తున్నాయని సీఎస్ వివరించారు. విదేశీ వర్సిటీలకు మౌలిక వసతులు, పెట్టుబడులు, అనుమతులపై సమగ్ర విధానం ప్రవేశపెడతామని అన్నారు. గ్లోబల్ సమ్మిట్ నాటికి స్పష్టమైన కార్యాచరణ, ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను సీఎస్ సంజయ్ జాజు ఆదేశించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రపంచంలోనే పాల ఉత్పత్తిలో భారత్ ముందంజలో ఉంది: కిషన్‌రెడ్డి
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో కీలక ముందడుగు.. క్లిష్ట దశను దాటాం: మంత్రి ఉత్తమ్
వెయ్యిరోజులు దాటినా 6 గ్యారెంటీల అమల్లో రేవంత్ సర్కార్ విఫలం: హరీశ్‌రావు
Read Latest Telangana News And AP News And National News
And Telugu News