ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో కీలక ముందడుగు.. క్లిష్ట దశను దాటాం: మంత్రి ఉత్తమ్
ABN , Publish Date - Oct 04 , 2026 | 06:32 PM
ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో కీలక ముందడుగు పడిందని.. క్లిష్ట దశను దాటామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రమాదకరమైన షియర్ జోన్‌ను దాటి తవ్వకాలు ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు.
హైదరాబాద్, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో కీలక ముందడుగు పడిందని.. క్లిష్ట దశను దాటామని తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Telangana Minister Uttam Kumar Reddy) వ్యాఖ్యానించారు. ప్రమాదకరమైన షియర్ జోన్‌ను దాటి తవ్వకాలు ముందుకు సాగుతున్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లా ఎమ్మెల్యేలతో మంత్రి ఉత్తమ్ ఈరోజు (ఆదివారం) సచివాలయంలో సమావేశం నిర్వహించారు. ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. గత ఆరు నెలల్లో సుమారు 700 మీటర్ల మేర చేపట్టిన సొరంగం పనుల్లో పురోగతి సాధించామని వెల్లడించారు.
2028 జూన్ నాటికి నీటిని అందించడమే లక్ష్యం..
అవుట్‌లెట్ వైపు 450 మీటర్లు.. ఇన్‌లెట్ వైపు 250 మీటర్ల పనులు జరిగాయని మంత్రి తెలిపారు. మొత్తం 43.968 కిలోమీటర్ల ప్రధాన సొరంగంలో 79 శాతం పనులు పూర్తి అయ్యాయని చెప్పుకొచ్చారు. ఇంకా 9.1కిలోమీటర్ల మేర సొరంగం తవ్వకాల పనులు మిగిలి ఉన్నాయని వెల్లడించారు. 2028 జూన్ నాటికి నీటిని అందించడమే తమ లక్ష్యమని ఉద్ఘాటించారు. రెండు వైపులా కలిపి ప్రస్తుతం రోజుకు సుమారు 8 మీటర్ల తవ్వకాలు జరుగుతున్నాయని వివరించారు. అదనపు యంత్రాలతో తవ్వకాల వేగం మరింతగా పెంచాలని అధికారులను ఆదేశించారు. జర్మనీ నుంచి లోకోమోటివ్.. అక్టోబరు చివరి నాటికి చేరే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. 2028 మే - జూన్ నాటికి టన్నెల్–1 అనుసంధానం చేస్తామని తెలిపారు. ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 30 టీఎంసీలకు పైగా నీరు అందించడమే తమ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
విద్యా, వైద్యంపై జిల్లాల వారీగా ప్రతి వారం సమీక్షించాలి: సీఎం రేవంత్‌రెడ్డి
తెలంగాణలో వనరుల సమీకరణపై ప్రత్యేక దృష్టి: భట్టి విక్రమార్క
వచ్చే ఎన్నికల్లో పోటీపై మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
Read Latest Telangana News And AP News And National News
And Telugu News